ప్రపంచం మొత్తం కరోనా వైరస్ పేరు వింటే చాలు భయపడిపోతున్నారు. ఎప్పుడు ఏలా ఎవరిని సోకుతుందో అని భయంతో చస్తున్నారు. ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా గర్భిణీ స్త్రీ లలో కూడా ఉంటుంది. అందుకనే కడుపుతో ఉన్న మహిళ అలాగే కడుపులో పెరిగే బిడ్డ కూడా చాలా జాగ్రత్తలు వహించాలి. లేదంటే తల్లికి బిడ్డకు ఇద్దరికి ప్రమాదమే. కొన్ని అనుకోని పరిస్థితులలో ఒకవేళ  కొవిడ్‌-19’ వ్యాధి గర్భంతో ఉన్న మహిళకు సోకితే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా  పాటించాలి. అవేంటో తెలుసుకుందాం కోవిడ్ -19 వ్యాధి సోకి కాన్పు సమయం దగ్గర పడిన స్త్రీని ఐసోలేషన్‌/క్వారంటైన్‌లో తప్పనిసరిగా ఉంచాలి.  

 

 

 

 


అవసరమైనప్పుడు ఆక్సిజన్‌ను తప్పనిసరిగా అందించాలి.సెకండరీ బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్స్  అంటే ఈ వైరస్‌ వలన మళ్ళీ తిరిగి బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ వంటివి రాకుండా యాంటీబయోటిక్స్‌ ఇవ్వాలి. తల్లినీ బిడ్డనీ క్షుణ్నంగా పర్యవేక్షించాలి.కాన్పు విషయానికొస్తే.. మామూలు గర్భవతికి ఏ రకంగా అయితే డెలివరీ చేయాలనుకుంటారో కొవిడ్‌-19 బాధితులకు కూడా అదే విధంగా నిర్ణయిస్తారు.ఈ వైరస్‌ సోకిన వారందరికీ సిజేరియన్‌ చేయాల్సిన అవసరం లేదు. అందుకు ప్రత్యేకమైన కారణాలుంటేనే చేయాలి.అన్ని రకాల సదుపాయాలున్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్లోనే కాన్పు జరగాలి.

 

 

 

ఈ క్రమంలో స్త్రీల వైద్య నిపుణులు, శ్వాసకోశ, మూత్రపిండాలు-గుండె సంబంధిత, పిల్లల వైద్య నిపుణులు... కాన్పు జరిగే సమయంలో అందుబాటులో ఉండాలి.కరోనా వైరస్‌ తల్లి నుంచి బిడ్డకు నేరుగా సోకదు. బాధితుల వల్ల ఎలాగైతే చుట్టూ ఉన్న వారందరికీ ఈ వైరస్‌ వ్యాపిస్తుందో... బిడ్డకూ తల్లి నుంచి అలానే వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని బిడ్డను తల్లి నుంచి దూరంగా ఉంచడం, పాలిచ్చేటప్పుడు తల్లి మాస్కులు ధరించడం, చేతులు శుభ్రం చేసుకున్న తర్వాతే బిడ్డను ముట్టుకోవడం వంటి  జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిపాలలో ఈ వైరస్‌ ఉండే అవకాశం లేదు. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ తల్లి బిడ్డకు నిశ్చింతగా పాలు ఇవ్వవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: