ప్రెగ్నన్సీ సమయంలో తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషక విలువలను కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడే కడుపులో శిశువు ఆరోగ్యంగా పెరుగుతుంది. ముఖ్యంగా కడుపుతో ఉన్న మహిళలు ఎక్కువగా పండ్లు తింటూ ఉండాలి. అందులోను కివి పండ్లలో మంచి పోషక విలువలు ఉన్నాయి. వీటిలో శరీరానికి కీలకమైన విటమిన్ సి, ఇ, ఫోలేట్ వంటి పోషకాలు కివి పండ్లలో ఎక్కువగా ఉంటాయి. కివి పండ్లు తియ్యగా మరియు రుచిగా ఉంటాయి.ఇప్పుడు మనం గర్భధారణ సమయంలో కివి పండు యొక్క అద్భుతమైన ప్రయోజనాలను తెలుసుకుందాం.

 


కివి పండులో విటమిన్ సి, ఇ ఉన్నందున దీనిని ‘న్యూట్రిషనల్ పవర్ హౌస్’ గా పరిగణిస్తారు.ఇందులో మినరల్స్, డైటరీ ఫైబర్,యాంటీఆక్సిడెంట్లు,ఫోలిక్ యాసిడ్, పొటాషియం మొదలైనవి ఉన్నాయి.ఈ పండు తినడం వల్ల శిశువు యొక్క మెదడు అభివృద్ధి  చెందడానికి సహాయపడుతుంది.కివి పండులో విటమిన్ సి, ఇ లను కలిగి ఉండడం వల్ల రోగనిరోధక శక్తి తల్లికి, బిడ్డకి ఇద్దరికి పెరుగుతుంది.గర్భధారణ సమయంలో కివిని తినడానికి ఎటువంటి పరిమితి లేనప్పటికీ,రోజుకు 2-3 పండ్లను తినాలని సూచిస్తున్నారు.కివి పండ్లను రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. తద్వారా హృదయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కివి పండ్లలో పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటు సమర్థవంతంగా తగ్గుతుంది. 

 

 

కివి పండ్ల రసం గుండెను రక్షిస్తుంది.గర్భిణీ స్త్రీకి గర్భధారణ ప్రారంభ నెలల్లో పిండం యొక్క ఆరోగ్యకరమైన అభివృద్ధికి ఫోలిక్ ఆమ్లం ఎంతగానో అవసరం.గర్భధారణ సమయంలో శరీరానికి తగిన మొత్తంలో విటమిన్ కె అవసరం.విటమిన్ కె వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. కివి పండులో విటమిన్ కె ఎక్కువగా ఉంటుంది. కివి పండ్లలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది.ఇది గర్భిణీ స్త్రీకి మలబద్దకం రాకుండా సహాయపడుతుంది.కివి పండును క్రమం తప్పకుండా తినడం వల్ల మంచి జీర్ణక్రియ ఉంటుంది. గ్యాస్ మొదలైన వాటి నుండి ఉపశమనం లభిస్తుంది. అందుకనే కచ్చితంగా కివి పండ్లను గర్భిణీ స్త్రీలు తినడం మంచిది.. !

మరింత సమాచారం తెలుసుకోండి: