పెళ్లి తర్వాత ప్రతీ మహిళా ఎంతో ఆత్రుతతో ఎదురుచూసేది గర్భధారణ సమయం కోసమే.అయితే గర్భధారణ సమయంలో ప్రతి మహిళ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవాలి. నేటి ఆధునిక యుగంలో ఖర్చులు పెరుగుతున్నాయి కాబట్టి మహిళలు ఉద్యోగాలకి  వెళ్లక తప్పడంలేదు. అందుకనే గర్భధారణ సమయంలో కూడా పనిని కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది.. అయితే ఆ సమయంలో తగిన జాగ్రత్తలు , సలహాలు, సూచనలు తీసుకుంటే మీ ప్రెగ్నన్సీ కాలం సాఫీగా ముగుస్తుంది. ఆ సమయంలో పనికి వెళ్లడం వల్ల శారీరకంగా అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి, శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉండడం గర్భిణీ స్త్రీల ప్రధాన విధి.

 

 

గర్భిణీ స్త్రీలు తమతో పాటు కడుపులో పెరుగుతున్న తమ బిడ్డను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.గర్భవతిగా ఉన్నప్పుడు పగలు ఆరోగ్యకరమైన పోషక పదార్దాలు ఉన్న ఆహారాన్ని తినడానికి ప్రయత్నించండి.తాజాగా ఉండే కూరగాయలు, పెరుగు, తృణ ధాన్యాలు, వెన్న, పండ్లు, పాలు, గుడ్లు, మొలకెత్తిన గింజలు మరియు సోయా వంటివి తీసుకోవచ్చు.రోజూ కాల్షియం తీసుకోవడం గర్భిణీ స్త్రీలకు మేలు చేస్తుంది. ఆఫీస్ లో పాప్‌కార్న్, పీనట్ బట్టర్, ఉడికించిన గుడ్లు, జున్ను, పండ్లు ఇలాంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ రోజులో ఎప్పుడైనా తినవచ్చు. మీరు ఆకలితో ఉండకుండా రోజులో అప్పుడప్పుడు ఏదోఒకటి తింటూ ఉండాలి.చిన్న చిన్న విరామాలు తీసుకుని మంచి ఆహారం,పండ్లు తీసుకుంటూ ఉండాలి. మీరు ఆఫీస్ కూ వెళ్ళేటప్పుడు మీతో పాటు బార్లీ వాటర్, లేదా నిమ్మరసం తీసుకుని వెళ్లడం మంచిది.శరీరాన్ని ఎప్పూడు హైడ్రేషన్ లో ఉంచుకోవాలి.అలారంను సెట్ చేసుకోండి పని షెడ్యూల్లో పడి ఆహారం, పండ్లు తీసుకోవడం మర్చిపోతుంటారు. కాబట్టి, అలారంను సెట్ చేసుకోండి,తద్వారా మీరు డైట్ ప్లాన్‌ను సరిగ్గా అనుసరించవచ్చు.

 

 

గర్భిణీ స్త్రీలకు తగినంత నిద్ర అవసరం. ఇంట్లో గర్భిణీ స్త్రీలు మధ్యాహ్నం పడుకునే పరిస్థితి ఉండవచ్చు. అయితే ఇది ఉద్యోగం చేసే మహిళలకు అనుకూలంగా ఉండదు, కాబట్టి,రాత్రి పూట  బాగా నిద్రపోవాలి.అలాగే ఎక్కువ సేపు కూర్చోడం కూడా మంచిది కాదు. కొంచెం విరామం తీసుకుని వీలయితే అటు ఇటు నడవడానికి ప్రయత్నం చేయండి.అలాగే మీరు ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు, ప్రయాణం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రద్దీగా ఉన్న బస్ గాని,  ఆటోలోగాని ప్రయాణం చేయకూడదు.  ఇప్పుడు కూడా మీ హ్యాండ్ బ్యాగ్ లో సమయానికి వేసుకోవాలిసిన మందులు, అలాగే ఏవన్నా బిస్కేట్స్ గాని పెట్టుకోండి. గర్భందాల్చిన సమయంలో మెట్లను ఎక్కకుండా లిప్ట్ వాడకోవడం ఉత్తమమైన పని. మెట్లు ఎక్కడం వల్ల అలసిపోవడమో లేదా మరేదైనా ప్రమాదం జరగవచ్చు. కాబట్టి మెట్లు ఎక్కకపోవడం మంచిది. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: