అమ్మ : గర్భిణీ స్త్రీ రోజుకి ఎంత నీరు తాగితే మంచిదో తెలుసా... !!

Suma Kallamadi

గర్భం దాల్చడం అనేది ప్రతి మహిళ జీవితంలో ఒక మరుపురాని అనుభూతి. గర్భం దాల్చినప్పటి నుంచి గర్భిణీలను అనేక సందేహాలు  వెంటాడుతాయి. ఏ ఆహార పదార్థాలను తీసుకోవాలి అలాగే వేటిని తీసుకోకూడదు అన్న సందేహాలు వెంటాడుతాయి. అలాగే తాగె నీటి విషయంలో కూడా సందేహం తలెత్తుతుంది. అసలు గర్భముతో ఉన్న మహిళ ఎంత నీరు తాగాలి? ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నీటిని తీసుకోవాలి. గర్భిణీలు కూడా తగినంత నీటిని తీసుకోవాలి. తనలో జీవం పోసుకుంటున్న మరో ప్రాణి సంరక్షణ కొరకు నీటిని తీసుకునే మోతాదును కొంచెం పెంచుకోవాలి. గర్భిణీలు ప్రతి రోజూ దాదాపు 2.3 లీటర్ల నీటిని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

 

 

అంటే సుమారుగా 10 కప్పుల నీటిని గర్భిణీలు తీసుకోవాలి.గర్భిణీ తగినంత నీటిని తీసుకోకపోవడం వలన తన ఆరోగ్యంతో పాటు గర్భస్థ శిశువు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. గర్భిణీలు తగినంత నీటిని తీసుకోకపోవడంతో శరీరంలో ఉత్పత్తి అయ్యే వేడి నియంత్రణలో ఉండదు. గర్భిణీల శరీరంలో వేడి సహజంగానే కొంత ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ వేడిని నియంత్రించకపోతే శరీరం ఎక్కువ వేడికి గురవుతుంది. ఇది మొదటి మూడు నెలలలొ మొదలైతే, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ బారిన పడి కొన్ని సార్లు గర్భస్రావంకు గురయ్యే ప్రమాదం ఉంది.తగినంత నీటిని తీసుకోకపోవడంతో దీని ప్రభావం తల్లిపాలపై పడుతుంది. మరింత విపరీతమైన పరిస్థితులలో దీని వలన తల్లి తన బిడ్డకు సరైన పోషణను తన పాల ద్వారా అందించలేకపోతుంది.

 

 

అటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే ప్రతి రోజూ తగినంత నీటిని తీసుకోవాలి.గర్భిణీలు తగినంత నీటిని తీసుకోకపోవడం వలన గర్భస్థ శిశువుపై దుష్ప్రభావం పడే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితులలో పుట్టుకతో కలిగే లోపాలు తలెత్తే ప్రమాదం ఏర్పడవచ్చు. మొదటగా, శరీరంలోని ఉమ్మనీటి స్థాయి తగ్గిపోతుంది. ఉమ్మనీరు గర్భస్థ శిశువుకు రక్షణ కవచంలా ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. ఉమ్మనీటి స్థాయి తగ్గిపోవడం వలన గర్భస్థ శిశువుకు రక్షణ కరువవుతుంది. న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ తలెత్తే ప్రమాదం ఎక్కువవవచ్చు. ప్రీ టర్మ్ లేబర్ సమస్య ఎదురవవచ్చు. అందువలన, గర్భిణీలు తగినంత నీటిని తీసుకోవాలి.తాజా పండ్ల రసంలో విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.ఇవి గర్భిణీలకు అత్యంత అవసరం. తాజా పండ్ల రసాన్ని తాగండి.పాలలో ప్రోటీన్లుతో పాటు కేల్షియం పుష్కలంగా లభిస్తుంది. గర్భిణీలు పాలను తగినంత తీసుకోవాలి. కనీసం ఒక కప్పుడు పాలనైనా రోజూ తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: