గర్భం ధరించిన మహిళ ఎల్లవేళలా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే ఆ మహిళ కడుపులో ఒక ప్రాణం ఊపిరి పోసుకుంటుంది కాబట్టి. తినే విషయంలో చాలా జాగ్రతలు వహించాలి. మాములు సమయంలో తినే తిండి కన్నా రెట్టింపు ఆహారాన్ని తినాలి. ఎందుకంటే తినే ఆహారం ఒకళ్ళకి కాదు ఇద్దరికి అని గర్భిణీ స్త్రీ గుర్తుపెట్టుకోవాలి. అందుకనే గర్భిణీ స్త్రీ కు కొన్ని జాగ్రత్తలు. గర్భవతులు అదనపు ఆహారం తప్పకుండా తీసుకోవాలి. రోజుకు మూడు కన్నా ఎక్కువ పూటలు భోజనం చేస్తే మరీ మంచిది.



ముడి ధాన్యాలు, మొలకెత్తిన ధాన్యాలు, పులిసిన పెరుగు అదనంగా తీసుకొవాలి. పాలు, మాంసము, కోడిగుడ్లు తీసుకోవాలి. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినాలి. మందులు వైద్యుని సలహా ప్రకారమే తీసుకోవాలి. ఐరన్, ఫోలిక్ కాల్షీయం 14 - 16 వారాల గర్బం నుంచి ప్రారంభించాలి. తల్లి పాలు ఇచ్చేంతవరకు పోడిగించాలి. గర్భవతి, రోజూవారీ చేసుకొనే పనులలో నడక ఉండాలి. కాని, ఎక్కువ బరువు పనులు అసలు చెయ్యరాదు. అదీ నెలలు నిండిన సమయంలో అసలు బరువులు ఎత్తకూడదు.


టీ, కాఫీ తాగడం వలన శరీరానికి కావలసినంత ఐరన్ అందదు. అందువలన భోజనం తరువాత, టీ / కాఫీ తీసుకొనరాదు. కారం తక్కువగా ఉండే పదార్థాలు తినాలి. ఛాతీలో మంట పుట్టించే మసాలా ఆహారాన్ని మానెయ్యటమే మంచిది. గర్భిణీ స్త్రీ ప్రసవం గురించిన భయన్ని వదిలివేయాలి. ఆ భయమే ప్రసవ సమయాన్ని కష్టతరము చేస్తుంది. గర్భము దాల్చడం, బిడ్డకు జన్మనివ్వడం అనేది సృష్టిలో సర్వసాధారణ విషయాలని గుర్తుంచుకోండి. గర్భము ధరించినప్పటి నుండి, బిడ్డకు పాలు ఇవ్వడం ఆపేంత వరకూ రక్తదానం చేయరాదు. గర్భము ధరించిన స్త్రీ ఎప్పుడుకూడా ప్రశాంతగా వుండాలి. గర్భం ధరించిన స్త్రీలు నిత్యం సంతోషంగా ఉండాలి. దీంతో పుట్టబోయే శిశువు కూడా అలాగే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: