బిడ్డను కడుపులో మోస్తున్న సమయంలో సంభోగం జరపడం గురించి దంపతులు తరచుగా అయోమయం చెందుతుంటారు. గర్భవతిగా ఉన్నపుడు సంభోగం జరపడం వలన పిండానికి హాని కలిగించవచ్చు అనే ఆలోచనలో ఉంటారు.అలాగే కొంతమంది మహిళలకు గర్భధారణ సమయంలో సంభోగాన్ని పొందాలన్న కోరిక ఏమాత్రం ఉండదు.గర్భం ధరించిన ప్రారంభ దశలలో స్త్రీలు వికారం, వాంతులు మరియు ఇతర అనారోగ్యాలకు గురవుతుంటారు.గర్భవతుల్లో తక్కువ సంభోగవాంఛకు ఇలాంటి చిన్న చిన్న రుగ్మతలు కారణం కావచ్చు.అందుకనే గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెలో వస్తున్న మార్పులను అర్థం చేసుకోవడం ఆమె యొక్క జీవితభాగస్వామికి చాలా ముఖ్యం.సంభోగంలో పాల్గొనాలా వద్దా అనేది పూర్తిగా ఆ జంటకు సంబంధించిన నిర్ణయం. కొంతమంది స్త్రీలు మరియు పురుషులు కూడా గర్భవతిగా ఉన్నప్పుడు సంభోగించడం అనేది నైతికంగా తప్పు అని అనుకుంటుంటారు.అలాంటి జంటలు వైద్యుడిని సంప్రదించి సలహాలు తీసుకోవడం మంచిది.



అయితే గర్భందాల్చి ఉన్నప్పుడు కూడా సెక్స్‌ను ఆస్వాదించొచ్చని సెక్సాలజిస్టులు చెబుతున్నారు. ఏడో నెల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని భంగిమల్లోనూ సెక్స్ చేసుకోవచ్చని పేర్కొంటున్నారు. అయితే స్త్రీ, కడుపులో బిడ్డ ఆరోగ్య దృష్ట్యా ఏడో నెల దాటిన తర్వాత సెక్స్‌లో పాల్గొనకపోవడమే మంచిదని సెక్సాలజిస్టులు సూచిస్తున్నారు.గర్భవతిగా ఉన్నప్పుడు సెక్స్ లో పాల్గొనటం వల్ల వారిలో నూతన ఉత్సాహం కలుగుతుంది. ఆ సమయంలో సెక్స్ వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.సెక్స్ లో పాల్గొంటే మంచి నిద్రపడుతుంది. మానసిక రుగ్మతను దూరం చేస్తుంది. మనసును తేలిక చేస్తుంది.



కాబట్టి గర్భిణీ స్త్రీలు సెక్స్‌లో పాల్గొంటే ఈ ప్రయోజనాలన్నింటినీ పొందవచ్చు.సెక్స్ అనేది వ్యాయామానికి ప్రతిరూపం లాంటిది. కాబట్టి గర్భిణీలు సెక్స్ చేయడం వారికి వ్యాయామంగా పనికొచ్చి బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. గర్భధారణ సాధారణంగా మహిళ రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపుతుంది. ఆ సమయంలో సంభోగంలో పాల్గొనడం వల్ల వారిలో ఇమ్యునిటీ పెరుగుతుంది. గర్భం ధరించిన స్త్రీ యొక్క ఆరోగ్య పరిస్థితి అలాగే కడుపులో బిడ్డ ఆరోగ్య పరిస్థితి దృష్టిలో ఉంచుకుని సెక్స్ లో పాల్గొనాలి. ముందుగా వైద్యుడి సలహా అనేది ముఖ్యం.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: