గోధుమలు,ఇతర తృణధాన్యాలు, విత్తనాలు, గింజలు (నట్స్), అరటిపండ్లు వంటి పండ్లలో, చేపలు, మాంసాలలో విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. అందుకే పైన తెలిపిన ఆహారపదార్ధాలు గర్భిణీ స్త్రీలు తరుచూ తీసుకోవాలి.అలాగే గర్భిణీ స్త్రీ మొదటి నెలలో తినవలసిన పండ్లు ఏంటంటే కమలాలు, మామిడి పండ్లు విటమిన్ సి, ఫోలిక్ ఆమ్లం యొక్క వనరులుగా ఉంటాయి.ఆప్రికాట్లు, దానిమ్మ వంటి పండ్లు ఇనుము, కాల్షియం, విటమిన్ కె, పొటాషియం మరియు ఫైబర్లను పుష్కలంగా అందించగలవు.
అలాగే ప్రెగ్నెన్సీ ప్రారంభంలో పాల ఉత్పత్తులు కూడా తినాలి పాల ఉత్పత్తులలో క అధిక-నాణ్యతగల ప్రోటీన్లు ఉంటాయి. పాల ఉత్పత్తులు కాల్షియం యొక్క ఉత్తమ ఆహార వనరులు. వీటిలో అధిక మొత్తంలో ఫాస్పరస్, వివిధ బి విటమిన్లు, మెగ్నీషియం మరియు జింక్ ఉంటాయి. గర్భిణీ స్త్రీలలో హార్మోన్ల స్థాయిలు పెరగడం వల్ల మలబద్దకం వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రెగ్నెన్సీ ప్రారంభంలోనే పాలు తాగడం మరియు ఎక్కువ పాల ఉత్పత్తులను తీసుకోవడం మంచిది. మరిన్ని ఆహార పదార్ధాల గురించి తదుపరి వ్యాసంలో చూద్దాం.. !!