కాకరకాయ కూర అంటే చాలా మంది తినరు  చేదుగా ఉంటుంది అని చాలా మంది తినరు. అయితే ఇందులో ఉండే అద్భుతమైన ఔషధగుణాల వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు తినడం వల్ల చాలా మంచిది. అయితే గర్భిణీలు కాకరకాయను తినడం సురక్షితమేనా అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. గర్భిణీలు బొప్పాయి, పైనాపిల్ వంటివి, కొన్ని రకాల వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కు దూరంగా ఉంటారు. కానీ కాకరకాయ తినడం వల్ల ఎటువంటి నష్టం ఉండదు. అయితే, గర్భిణీలు ఏ ఆహారం తీసుకున్నా మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. పరిమితికి మించి తీసుకుంటే ఏదైనా విషంగా మారే ప్రమాదం.అయితే గర్భిణీలు కాకరకాయ తింటే జరిగే మేలు గూర్చి తెలుసుకుందాం.. !



గర్భిణిలలో యుటేరియన్ బ్లీడింగ్ సమస్య మరియు ఇతర సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి, గర్భిణీలు కాకరకాయ తింటే మంచిది. గర్భిణీ స్త్రీలకు ఫొల్లెట్ చాలా అవసరం.కాకరకాయ తింటే రక్తం పడుతుంది. అలాగే కాకరకాయలో మినరల్స్ కూడా ఉంటాయి.  ఈ మినిరల్స్ పుట్టబోయే బిడ్దకు చాలా సురక్షితమైనది. న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ను నివారిస్తుంది. బిట్టర్ గార్డ్ లో ఉండే హై ఫొల్లెట్ కంటెంట్ కాబట్టి, గర్భిణీలు మితంగా తినడం మంచిదే.ఈ వెజిటేబుల్ ను రెగ్యులర్ గా తింటుంటే బరువు కంట్రోల్లో ఉంటుంది.చాలా మంది గర్భిణీ స్త్రీలు మలబద్దకం, హెమరాయిడ్స్ సమస్యను ఫేస్ చేస్తుంటారు, ఈ సమయంలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉన్న ఆహారాలు తినడం వల్ల మలబద్దకం, హెమరాయిడ్స్ సమస్యను నివారించుకోవచ్చు.




బిట్టర్ గార్డ్ లో యాంటీ డయాబెటిక్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి దీన్ని తప్పనిసరిగా రోజూ తినడం మంచిది. కాకరకాయలో విటమిన్స్ మరియు మినిరల్స్ అధికంగా ఉంటాయి. ఇందులో ఐరన్, నియాసిన్, పొటాసియం, ప్యాంటోథెనిక్ యాసిడ్, జింక్, పెరిడాక్సిన్, మెగ్నీషియం, మాంగనీస్, వంటివి అధికంగా ఉంటాయి. అందుకే కాకరకాయను సూపర్ వెజిటేబుల్ అని పిలుస్తారు.కాకరకాయలో విటమిన్స్, మినిరల్స్ తో పాటు, రిబోఫ్లెవిన్, థైయమిన్, విటమిన్ బి1, బి2, బి3 అధికంగా ఉన్నాయి. వర్షకాలంలో కాకరను ఎక్కువగా తీసుకోవడం వల్ల.. వాటిలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగాలను దూరం చేస్తాయి. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ కూడా బలంగా మారి, ఇన్ఫెక్షన్లు దూరం అవుతాయి.తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు..

మరింత సమాచారం తెలుసుకోండి: