ప్రతి తల్లి పుట్టిన బిడ్డ యొక్క ఆరోగ్యం గూర్చి మాత్రమే ఆలోచిస్తుంది.తన గూర్చి తాను ఆలోచించుకోదు. అంతెందుకు బిడ్డను కడుపులో మోసేటప్పుడు కూడా బిడ్డకోసం అన్ని పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటుంది.శిశువు పుట్టిన తర్వాత బాలింతలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవటం మానేస్తారు. సరైన పోషక ఆహారం తినకపోవడం వలన అనారోగ్యం పాలవుతారు.అందుకని బాలింతలు సరైన పోషక విలువలు ఉన్న ఆహారం తినాలి.అలా అని ఏది పడితే అది తినకూడదు.అసలు బాలింతలు ఎటువంటి ఆహారాన్ని తినకూడదు అనే విషయాల్ని తెలుసుకుందాం.. !!

బాలింతలు నూనెలో బాగా వేయించిన ఆహార పదార్ధాలు తినకూడదు. వేయించిన ఆహార పదార్థాలలో ఎక్కువ కేలరీలు ఉంటాయి. ఇవి కొవ్వును పెంచి శరీరం లావు అయ్యేందుకు కారణం అవుతాయి.మనం మార్కెట్లో ఎన్నో ఆహార పదార్థాలను ప్రాసెస్స్ చేసి ప్యాక్ చేసి అమ్మడం చూసే ఉంటాము, ముఖ్యంగా మాసం మరియు చేపలు. ఇవి తొందరగా చెడిపోకుండా ఉండేందుకు ప్రిజర్వేటివ్స్ ని మరియు సోడియంను ఎక్కువగా కలుపుతారు. ఇవి చాలా హానికరమైనవి, వీటిని తినడం వలన బీపీ ఎక్కువ అవుతుంది. అలాగే బాలింతలు మద్యం సేవించకూడదు. ఇది మీ శరీరానికి హాని కలిగించటమే కాకుండా శిశువుకు మీరు ఇచ్చే పాలలో చేరి వారి పెరుగుదలపై ప్రభావం చూపుతుంది.


అలాగే  కెఫీన్ మీకే కాదు మీ శిశువు యొక్క నిద్రను కూడా భంగ పరుస్తుంది, అంతే కాదు శిశువుకు చిరాకు మరియు ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది మీ శరీరం యొక్క ఉష్ణోగ్రతను కూడా పెంచుతుంది. అంతే కాదు మీరు ఇచ్చే పాల ద్వారా ఈ సమస్యలు శిశువుకు కూడా కలగచ్చు. వారికి అనేక కడుపు నొప్పి సమస్యలు కూడా రావచ్చు.అందుకని కెఫిన్ ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది. శిశువు పుట్టిన తరువాత శరీరం యొక్క బరువు మెల్లగా తగ్గుతుంది. లావు అయ్యామని తొందరగా తగ్గాలని ఎక్కువ శ్రమకరమైన వ్యాయామాలను చేయకూడదు.అలాగే తాగే నీటిని కూడా కాచి చల్లార్చిన నీటిని తాగాలి.అలాగే ఎక్కువ గ్యాస్ వచ్చే ఆహార పదార్ధాలకు దూరంగా ఉండడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: