
వెల్లుల్లి వాడడంవల్ల ఆడవాళ్ళ జుట్టుకి ఏన్ని లాభాలో తెలుసుకుందాం... వెల్లుల్లిలో జింక్, సల్ఫర్, కాల్షియం వంటి కొన్ని ముఖ్యమైన పదార్థాలు ఉండటం వల్ల జుట్టు రాలడాన్ని ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. వెల్లుల్లి జుట్టు యొక్క ప్రతి మూలాలను శుభ్రపరుస్తుంది. వెల్లుల్లి వాడడం వల్ల జుట్టు బలంగా కూడా పెరుగుతుంది. అలాగే చుండ్రుతో ఇబ్బందిపడే ఆడవాళ్లకు వెల్లుల్లి ఉత్తమ పరిష్కారం. వెల్లుల్లికి తేనె జోడించడం వల్ల జుట్టు రాలడాన్ని నివారించవచ్చు. కొన్ని వెల్లుల్లి రెబ్బలను తీసుకొని మెత్తగా పేస్ట్ లా చేయాలి. దీనికి ఒక టేబుల్ స్పూన్ తేనె వేసి కలిపిన మిశ్రమాన్ని మీ తలకు రాసుకుని 20 నిమిషాలు తరువాత సాధారణ షాంపూతో మీ తలను శుభ్రం చేసుకోండి.
ఇలా కనీసం వారానికి 2 సార్లు వాడడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అలాగే మనం జుట్టుకి సాధారణంగా కొబ్బరినూనె వాడుతూ ఉంటాము. అలా వాడే కొబ్బరినూనెలో వెల్లుల్ని కలిపి రాసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేయండి. కొబ్బరి నూనెను తేలికగా వేడి చేసి వెల్లుల్లిని అందులో వేసి మరి కొద్దీ సేపు వేడి చేసి చల్లారాక ఈ మిశ్రమాన్ని మీ తలపై అప్లై చేసి మసాజ్ చేయండి. మీరు ఈ నూనెను అరగంట అలాగే ఉంచి, తర్వాత సాధారణ షాంపూ ఉపయోగించి తలస్నానం చేయండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే మీ జుట్టు ఊడిపోదు. ప్రతిసారి ఇలా చేయడం కుదరకపోతే ఒకేసారి పైన చెప్పిన విధంగా నూనె తయారు చేసుకుని ఒక సీసాలో భద్రపరుచుకోవచ్చు.