గుమ్మడి కాయ అధిక పోషకాలు కలిగిన కూరగాయ.గర్భధారణ సమయంలో గుమ్మడికాయ, దాని విత్తనాలను తినడం వల్ల కడుపు తిమ్మిరిని తగ్గించడానికి సహాయపడుతుంది. గుమ్మడికాయ పోషకాలకు మంచి మూలం. ఈ గుమ్మడికాయ తినడం వల్ల గర్భిణీ స్త్రీకి ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఇనుము, కాల్షియం, నియాసిన్, భాస్వరం లభిస్తాయి.శిశువు అలాగే తల్లికి అవసరమైన అన్ని ఆరోగ్య ప్రయోజనాలను ఈ గుమ్మడికాయ అందిస్తుంది.
గర్భధారణ సమయంలోచాలామంది ఎదుర్కునే ప్రధాన సమస్య అతిసారం. కాబట్టి గర్భధారణ సమయంలో గుమ్మడికాయ తినడం వల్ల ప్రేగులలోని పురుగులను తొలగించి కడుపును శుభ్రపరుస్తుంది.
అలాగే చర్మం మీద తామర వంటివి ఎమన్నా ఉంటే తగ్గిస్తుంది. గర్భధారణ సమయంలో వచ్చే కడుపు నొప్పిని కూడా సరిచేస్తుంది. గర్భధారణ సమయంలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి గుమ్మడికాయ సహాయపడుతుంది.
గుమ్మడికాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది గర్భిణీ స్త్రీల జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే మలబద్దకాన్ని నివారిస్తుంది.గర్భిణీ స్త్రీలకి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే గుమ్మడికాయ తినడం వల్ల కొంతమందిలో అలెర్జీని కలిగిస్తుంది. పెద్ద మొత్తంలో గుమ్మడికాయను తిన్నప్పుడు తలనొప్పి, కడుపు నొప్పి, విరేచనాలు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.కాబట్టి మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది..!