అల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. అల్లంలో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా…బరువుని తగ్గించడంలో అల్లం బాగా పని చేస్తుంది. ఇలాంటి అల్లంతో టీ చేసుకుని తాగడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఆడవారి శరీర ఉష్ణోగ్రతని పెంచి కొవ్వుని తగ్గించడంలో అల్లం బాగా పనిచేస్తుంది. అల్లంటీలో చక్కెర వేయకుండా కేవలం తేనె వేసుకుని తాగుతుండాలి. ఇలా చేస్తే త్వరగా మీ శరీరంలోని అదనపు కొవ్వు తగ్గి నడుము భాగం అందంగా మారుతుంది.అలాగే నట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో బాదం పప్పు ఒకటి.
బాదం పప్పుని తినడం వల్ల ఆరోగ్యం మెరుగు పడడమే కాకుండా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వుని కరిగించడంలో బాదం పప్పు బాగా పనిచేస్తాయి. బాదంలో ఎక్కువగా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని కరిగిస్తాయి. అయితే వీటిని అలానే తినడం కాకుండా.. ప్రతి రోజూ పడుకునే సమయంలో నీటిలో నానబెట్టి.. ఉదయం తినాలి.. ఇలా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.అలాగే మన వంట ఇంట్లో దొరిజే జీలకర్ర కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనికి కూడా అదనపు కొవ్వుని తగ్గించే గుణం ఉంది.. కాబట్టి ప్రతిరోజూ ఓ టీస్పూన్ పరిమాణంలో జీరాని ఓ గ్లాసు నీటిలో మరిగించి ఆ నీటిని తాగుతుండాలి. ఇలా చేస్తుంటే.. ఒంట్లోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది.. దీనివల్ల నడుము కూడా ఎంతో అందంగా తయారవుతుంది. రెగ్యులర్‌గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.