చాక్‌పీస్‌లు, బలపాల పెద్ద విష పదార్ధం కాదు. కానీ దాన్ని తినటం మంచిది కాదు. దాని వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి. జీర్ణ సమస్యలు, మలబద్ధకం, కడుపులో నులిపురుగు పెరగడం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. ప్రెగ్నెంట్స్ గానీ, పిల్లలకు పాలు ఇచ్చే తల్లులు గాని వీటిని తింటే దాని వల్ల వచ్చే నష్టాలు వేరేలా ఉంటాయి. వారికి సరిగా ఆకలి వేయదు. అన్ని రకాలా ఆహార పదార్ధాలూ తీసుకోలేరు. దీనివల్ల పోషకాహార లేమి వస్తుంది. ఇది వారికి మాత్రమే కాదు..
పుట్టబోయే పిల్లలకి కూడా మంచిది కాదని చెబుతున్నారు.అలాగే బలపాలు, చాక్ పీస్ తినేవారు రక్త హీనత సమస్యతో బాధపడతారు. వల్ల చర్మం చూడడానికి పాలి పోయినట్లు ఉంటుంది.ఇలాగే ఎక్కువ కాలం చాక్ పీస్, బలపాలు తింటే రక్తంలో మార్పు వస్తుంది. ఫలితంగా తల్లి బిడ్డకు ఇద్దరికి హాని కలుగుతుంది.అందుకనే గర్భిణీ స్త్రీలు ఎంత వీలయితే అంతా బలపాలు తినకుండా ఉంటే కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది.గర్భిణీ స్త్రీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఏది తినాలన్న గాని మీ బిడ్డ ఆరోగ్యాన్ని, ఎదుగుదలను దృష్టిలో పెట్టుకుని తినండి..