ప్రతి మహిళ అమ్మ అన్న పిలుపు కోసం ఎదురుచూస్తుంది. తన పిల్లలతో ఆనందంగా జీవించాలని కోరుకుంటుంది. కడుపులో పెరిగే బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటుంది. అయితే ఇలాంటి ఆశలు అన్ని కరిగిపోయేలా అబార్షన్ అనే పరిస్థితిని కొన్ని కొన్ని సార్లు మహిళలు ఎదుర్కొవలసి వస్తుంది. ఒకసారి అయితే ఏదో కారణం అనుకోవచ్చు. కానీ కొంత మంది మహిళలు ప్రతీసారి ఇదే పరిస్థితిని ఎదుర్కొంటారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతిసారీ అబార్షన్ అవ్వడాన్ని రిక్కరెంట్  ప్రెగ్నెన్సీ లాస్ అంటారు. ఇలా జరగడానికి గల కారణాలు తెలుసుకుందాం.. !!


క్రోమోజోమ్ సమస్యలు, యాంటీ ఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్, ఇమ్యునలాజికల్ సమస్యలు, సెప్టేట్ యుటెరస్, హార్మోన్ సమస్యలు వీటితో పాటు థైరాయిడ్, డయాబెటీస్, పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (నీటి బుడగలు) లాంటివి కారణాలు అవుతాయి.ఇలాంటి కారణాల వల్ల చాలా మంది మహిళల్లో గర్భస్రావం అవుతుంది. అంతే కాదు మగవారి నుంచి విడుదలయ్యే వీర్య కణాలు నాణ్యతగా ఉండకపోయినా లేదా ఆడవారిలో అండం సరిగ్గా లేకపోయినా ఈ సమస్య ఎదురవుతుంది. ఈ సమస్య పరిష్కారమవ్వాలంటే దేనివల్ల అబార్షన్ అవుతుందో ముందుగా తెలుసుకోవడం ముఖ్యం.



అందుకోసం పరీక్షలు అన్ని చేయించుకుని సమస్య గురించి తెలుసుకోవాలి. దానికి ట్రీట్‌మెంట్ తీసుకోవాలి. అందుకు నిపుణులైన వైద్యులను సంప్రదించాలి. ఇలా చేస్తే మీ సమస్య ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది.. ప్రెగ్నెన్సీ నిలబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు అధునాతనమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.ఒకవేళ సమస్య అలానే ఉంటే గనుక ఐవీఎఫ్‌ని ఆశ్రయించడం మేలు. అంతే కాని ఈ సమస్యను పదే పదే తలచుకుని బాధపడడం మంచిది కాదు.. అలానే చాలా మంది మహిళల్లో నెలలో, మూడవ నెలలో ఎక్కువగా గర్భస్రావాలు అవుతూ ఉంటాయి. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. బరువు పనులు అసలు చేయకూడదు. ఎప్పటికప్పుడు వైద్యుని పరివేక్షణలో జాగ్రత్తలు తీసుకోవాలి.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: