1/2 స్పూన్ పెసరపిండిలో 2 స్పూన్ల కలబంద జెల్ వేసి బాగా కలిపి ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మీద ఉన్న సన్ టాన్ తొలగిపోతుంది. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.అలాగే ఒక స్పూన్ పెసరపిండిలో రెండు స్పూన్ల నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని ఆరిన తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మీద టాక్సిన్స్ తొలగిపోతాయి.
1/2 స్పూన్ పెసరపిండిలో 1/2 స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలిపి ఈ మిశ్రామన్ని ముఖానికి రాసుకుని 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.అంతేకాదు పెసరపిండిని నలుగుపిండి (సున్ని పిండి )లో కూడా ఉపయోగిస్తారు. ఎలా ఈ పిండితో నలుగు పెట్టడం వల్ల చర్మం మీద ఉన్న దుమ్ము, ధూళి అన్ని పోతాయి. ఇప్పటికి పెళ్లిలో నూతన వధూవరులకు నలుగు పిండి పెట్టి స్నానం కూడా చేయిస్తారు. ఎలా నలుగు పిండి పెట్టడం వల్ల చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది.. వధూవరులు కూడా అందంగా కనిపిస్తారు..