
మహిళల పీరియడ్స్, గర్భదారణ సమయంలో ఇవి ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంది. ఇంకా స్థూలకాయం, వంశపార్యపర్యత వల్ల కూడా కణుతులు ఏర్పడటానికి ముఖ్య కారణాలు. కొన్ని లక్షణాల ద్వారా కణతులు ఉన్నాయని గుర్తించవచ్చు. అధిక రుతుస్రావం, పొత్తికడుపులో నొప్పి, నడుము నొప్పి, మూత్రాశయంపై ఒత్తిడి పెరిగి తరచూ మూత్రానికి వెళ్లాలని అనిపించడం వంటి లక్షణాలను గమనించవచ్చు.అందుకనే చాలా వరకు తాజా పండ్లు, కూరగాయలు, చేపలు మీ ఆహారంలో భాగం చేసుకోవాలి. గ్రీన్ టీని రెగ్యులర్ గా తాగాలి. రోజుకు మూడు నాలుగు సార్లు డైరీ ప్రొడక్ట్స్ తీసుకునే వారిలో 30 శాతం మందిలో కణుతులు రావు.
ఆపిల్ సైడర్ వెనిగర్ కణుతులు ట్రీట్మెంట్ లో మంచి హోం రెమెడీ. శరీరంలో కణుతులకు కారణం అయ్యే టాక్సిన్స్ ను తొలగించడానికి ఇది చాలా బాగా సహాయపడుతుంది. కణుతులను ముడుచుకుపోయేలా చేస్తుంది. వెల్లుల్లిలో ఉండే న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ కణుతులు పెరగకుండా అడ్డుకుంటుంది. అందుకే రోజుకు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను తినాలి. అలాగే ఒక టీస్పూన్ ఆమ్లా పౌడర్ ఒక టీస్పూన్ తేనె కలిపి ఉదయం పరగడుపున తీసుకుంటే కణతులను నివారించవచ్చు.