తల్లి ఆల్కహాల్ మానుకోవడం, మంచి జీవనశైలిని అవలంభించడం, పోషకమైన ఆహారం తీసుకోవడం వంటి అన్ని రకాల విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేకాదు కాఫీ మానెయ్యాలి, మసాలా ఐటమ్స్ వదిలేయాలి, ఫాస్ట్ ఫుడ్ వదిలేయాలి, ఇష్టం ఉన్న లేకున్నా ఆరోగ్యకరమైన ఆహరం మాత్రమే తీసుకోవాలి.ప్రెగ్నెన్సీ సమయంలో తల్లి కాస్మోటిక్ ప్రాడక్ట్స్ వాడటం మానెయ్యాలి. కాస్మోటిక్ ప్రాడక్ట్స్ లో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. అసలు ఈ రోజుల్లో కెమికల్స్ వాడనిదే ఒక్క స్కిన్ కేర్ ప్రాడక్టు కూడా తయారవడం లేదు. ఆ ప్రాడక్ట్స్ నుంచి కెమికల్స్ మన వినాళ గ్రంధుల్లోకి చొచ్చుకుపోయి హార్మోన్స్ ఇన్ బాలన్స్ కి కారణం అవుతాయి.
అదే జరిగితే బిడ్డ లోపాలతో పుట్టడం జరిగే ప్రమాదం కూడా లేకపోలేదు. అందువల్ల ఈ సమయంలో కాస్మోటిక్ ప్రాడక్ట్స్ వాడడం మంచిది కాదు.అంతేకాదు నెయిల్ పెయింట్, హెయిర్ డై, బ్యూటి క్రీమ్స్, మేకప్ ప్రాడక్ట్స్ అన్నిట్లోనూ ఈ కెమికల్స్ కలుపుతున్నారు. కాబట్టి గర్భంతో ఉన్న తల్లులు బిడ్డకు జన్మనిచ్చే దాకా అయినా కొద్దిగా మేకప్స్ వాడడం మానివేయాలి. బిడ్డకు అది సమస్యగా ఉంటుంది. దీని వల్ల కడుపులో పెరుగుతున్న శిశువు ఎలాంటి లోపాలు లేకుండా ఆరోగ్యంగా పెరుగుతుంది.