సహజంగా మహిళలు గర్భం పొందిన తర్వాత తీసుకొనే ఆహారం చాలా ప్రధాన పాత్రపోషిస్తుంది. ఎందుకంటే ఇది, కడుపులో పెరిగే శిశువుమీద కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి, గర్భధారణ సమయంలో గర్భిణీ తీసుకొనే సమతుల్యమైన హారంలో అవసరం అయ్యే పూర్తి పోషకాలుండాలి.తల్లి తీసుకొనే పౌష్టికాహారంతోనే కడుపులో పెరిగే బిడ్డ యొక్క మెంటల్,  ఫిజికల్ డెవలప్ మెంట్ ఆధారపడుతుంది. పౌష్టికాహారం మాత్రమే కాదు, ద్రవాలు కూడా హైల్తీ డైట్ లిస్ట్ లో చేర్చుకోవచ్చు. ప్రెగ్నెన్సీ వల్ల డీహైడ్రేషన్ ముఖ్యంగా మార్నింగ్ సిక్నెస్ ఎక్కువగా ఉంటుంది. సమయంలో ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. అయితే, హెల్తీ డ్రింక్స్ ను ఎంపిక చేసుకోవడం వల్ల మరింత ఎక్కువ ప్రభావం ఉంటుంది.కార్బొనేటెడ్ డ్రింక్స్, ఆల్కహాల్, లేదా కమర్షియల్ ఫ్రూట్ జ్యూస్ లను నివారించాలి. ఇలాంటివి కేవలం పొట్టను నింపుతాయి, శరీరానికి ఎటువంటి క్యాలరీలను అందివ్వడు.





 వీటిలో ప్రత్యేమైన ఎనర్జీ కంటెంట్ లేదా మీ ఆరోగ్యానికి ఉపయోగపడేవేవి కలిగి ఉండవు. అందుకే బెవరేజస్ లో ప్యూర్ వాటర్ ఒక బెస్ట్ అండ్ గుడ్ ఆప్షన్. అయితే, ప్లేయిన్ వాటర్ త్రాగలేము అనుకునే వారు, హెల్తీ బెవరేజస్ ను ఎంపిక చేసుకోవచ్చు. గర్భధారణ సమయంలో గ్రీన్ టీ తీసుకోవడం ఒక విధంగా మంచిదే. గర్భిణీలు కూడా గ్రీన్ టీ త్రాగడం ఆరోగ్యానికి మంచిదే. ఇది ఒత్తిడి తగ్గించడానికి సహాయపడుతుంది. గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.పాలు గర్భిణీ స్త్రీలకు ఒక ఉత్తమ బెవరేజ్. ఎందుకంటే మహిళలకు అవసరం అయ్యే క్యాల్షియం అందివ్వడంలో పాలు మంచిగా సహాయపడుతాయి. కానీ, పాలలో ఏ ఇతర ఆర్టిఫిషయల్ ఫ్లేవర్ పౌడర్స్ ను జోడించకండి. 





రోజుకు రెండు సార్లు పాలను త్రాగడం గర్భిణీలకు చాలా అవసరం.ఆరెంజ్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది గర్భిణీలో పూర్తి వ్యాధినిరోధకతను పెంచడానికి సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉండటానికి సహాయపడుతుంది. ఇంకా, శరీరంలో వ్యర్థాలను బయటకు నెట్టుటకు కూడా ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. కాబట్టి, గర్భధారణ సమయంలో ఆరెంజ్ జ్యూస్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి.

మరింత సమాచారం తెలుసుకోండి: