
కడుపుతో ఉన్నపుడు నెయ్యి తినడం మంచిదే. నెయ్యి తొందరగా అరుగుతుంది.అలాగే బాడీ మెటబాలిజం ని బూస్ట్ చేస్తుంది. అయితే, మీరు బరువు ఎక్కువ ఉంటే కొంచెం తగ్గించి తినాలి. ఎందుకంటే అధిక మొత్తంలో నెయ్యి తింటే బరువు పెరుగుతారు. అందుకనే లావుగా ఉండేవాళ్ళు తగ్గించి తినాలి.ప్రెగ్నెన్సీ టైం లో రోజుకి రెండు మూడు టీ స్పూన్ల నెయ్యి హాయిగా తీసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ టైమ్ అంతా మీరు నెయ్యి తీసుకోవచ్చు.నెయ్యి లో ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి.
నెయ్యిలో యాంటీ వైరల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవి అరుగుదలకి సహాయపడతాయి.నాలుగవ నెల నుండి, బేబీ పుట్టే వరకూ మీకు కనీసం మూడు వందల క్యాలరీలు ఎక్కువ కావాలి. నెయ్యి పుట్టే బిడ్డ ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది.నెయ్యి ఒత్తిడిని తగ్గించి మంచి మూడ్ ఇస్తుంది. నెయ్యి రోజుకి రెండు మూడు టీ స్పూన్స్ వరకు తీసుకుంటే ఏ హానీ లేదు. కానీ అంత కంటే ఎక్కువ అయితే మాత్రం తల్లీ, బిడ్డా కూడా బరువు పెరుగుతారు. నెయ్యి ఎక్కువ తీసుకుంటే డెలివరీ తరువాత మామూలు బరువు కి రావడం కొంచెం కష్టమౌతుంది..