ఆడవాళ్లు అందాన్ని కాపాడుకోవడం కోసం ఎన్నో రకాల  ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.చర్మం బిగుతనం పోకుండా, పొడిబారిపోయినట్లు లేకుండా ఉండడానికి మార్కెట్ లో దొరికే  రకరకాల బాడీ లోషన్స్ వాడుతూ ఉంటారు. కానీ వాటిలో రసాయనాలు కలపడం వల్ల చర్మానికి హాని జరుగుతుంది.అయితే మరి ఎలా..?? బాడీ లోషన్ లేకపోతే..??  అనే ఆలోచన మీకు వస్తుంది.. అందుకనే మీరు ఇంట్లోనే మీ కిచెన్ లో దొరికే కొన్ని పదార్ధాలతో సింపుల్ గా ఎలాంటి కెమికల్స్ లేకుండా బాడీ లోషన్ తయారుచేసుకునే పద్ధతి గురించి తెలుసుకోండి.



సాధారణంగా స్నానం చేసిన తరువాతా, నిద్ర కి ముందూ బాడీ లోషన్ అప్లై చేయడం వలన స్కిన్ న్యూట్రియెంట్స్ ని ఈజీగా అబ్జార్బ్ చేసుకుంటుంది.ఇలా రెగ్యులర్ గా బాడీ లోషన్ వాడడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ పోయి స్కిన్ కాంతివంతంగా మెరిసిపోతుంది. అయితే ఈ లోషన్ తయారు చేయడానికి మీకు కావలసిందల్లా కొంత బియ్యం, నీరు, విటమిన్ఆయిల్ కొన్ని చుక్కలు, ఎసెన్షియల్ ఆయిల్ కొన్ని చుక్కలు, లోషన్ స్టోర్ చేసేందుకు ఒక కంటెయినర్ మాత్రమే.

తయారు చేసే పద్ధతి:

మీరు ఈ లోషన్ ని స్కిన్ మీద అప్లై చేస్తారు కాబట్టి బియ్యాన్ని రెండు మూడు సార్లు బాగా కడగండి.ఇలా కడగడం వల్ల బియ్యంలో ఏమైనా దుమ్ము ఉంటే పోతుంది.
ఇప్పుడు ఈ బియ్యం తో అన్నం వండాలి.  అన్నం ఉడికిన తరువాత చల్లార్చి దాన్ని మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేయండి.
ఇప్పుడు ఈ పేస్ట్ లో కొన్ని చుక్కలు విటమిన్ఆయిల్ వేయండి. ఈ ఆయిల్ లో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఈ స్టెప్ మిస్ చేయకండి.అంటే విటమిన్ ఈ కలపడం మర్చిపోకండి.అలాగే మనం తయారుచేసే బాడీ లోషన్స్ కి మంచి ఫ్రాగ్రెన్స్ కూడా ఉండాలి కాబట్టి మీకు నచ్చిన ఎస్సెన్షియల్ ఆయిల్ కొన్ని చుక్కలు కలపండి.
ఇప్పుడు అన్నింటినీ బాగా మిక్స్ చేయండి.
ఇప్పుడు దీన్ని మీరు సిద్ధం గా పెట్టుకున్న కంటెయినర్ లోకి తీసుకోవాలి.ఈ లోషన్ ని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఇలా మనం ఇంట్లోనే తయారుచేసుకున్న  బాడీ లోషన్  కొన్ని రోజుల పాటూ ఫ్రిజ్ లో నిలువ ఉంటుంది. మీ అవసరాన్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు.ఇంకెందుకు మరి ఆలస్యం ఇలాంటి ఖర్చు లేదు, ఇలాంటి కెమికల్స్ కూడా లేవు.నాచురల్ గా తయారుచేసుకునే బాడీ లోషన్ ను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చుడండి.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: