భార్య గర్భిణీ సమయంలో భర్త గొడవలకు దూరంగా ఉండటం చాలా మంచిది.అలాగే పచ్చని చెట్లను నరకడం, కాల్చడం వంటివి చేయకూడదు. అంతేకాదు పాములను, వన్యప్రాణులను వేటాడి చంపడం చేయకూడదు. భార్య కు 7 నెలలు నిండిన తర్వాత భర్త అస్సలు క్షవరం(గడ్డం) చేయించుకోకూడదు అని మన పురాణాలు చెబుతున్నాయి..భార్య కు 7 నెలలు తర్వాత సముద్ర ప్రయాణం చేయరాదు.అలాగే తీర్థయాత్రలు, విదేశీ యాత్రలు, దైవ దర్శనాలకు వెళ్ళకూడదు. గుడిలో కొబ్బరికాయ కొట్టడం గాని, తల మీద శఠగోపం గాని పెట్టించుకోకూడదు.ఇంటి నిర్మాణం చేపట్టకూడదు.ఎటువంటి శంకుస్థాపన పనులు చేయరాదు.పిండ ప్రదానం, పితృ కర్మలు చేయకూడదు.
అలాగే కడుపుతో ఉన్న భార్య ఇంట్లో ఉన్నప్పుడు సిగరెట్ తాగడం అసలు చేయకూడదు.. సిగరెట్ పొగ అనేది పీల్చడం వల్ల తల్లికి అలాగే కడుపులో పెరిగే బిడ్డకు ప్రమాదమే. అలాగే మద్యం సేవించడం కూడా మంచి పద్ధతి కాదు.కడుపుతో ఉన్న భార్యను కొట్టడం, తిట్టడం లాంటివి అసలు చేయకూడదు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మీ భార్య కడుపులో పెరిగే బిడ్డ మీ రక్తం పంచుకుని పుట్టే బిడ్డ.. ఆ బిడ్డ ఆడ పిల్ల అయినా మగ పిల్లాడు అయినా గానీ చింతించకూడదు.కొంతమంది భర్తలు లింగ వివక్షత చూపుతారు. అలాంటివి అసలు చేయకూడదు.