ఆడవాళ్లు  అందరు ఎదుర్కొనే సౌందర్య సమస్యల్లో జుట్టు రాలడం ఒకటి. కాలాలు మారినప్పుడల్లా ఈ సమస్య కలుగుతుంది. సరైన సంరక్షణ,  సమతుల్య ఆహారంతో, జుట్టు సన్నబడడాన్ని, అలాగే ఊడిపోవడాన్ని నియంత్రించవచ్చు. మారుతున్న కాలాల్లో మీరు అనుసరించగల కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.అవేంటో తెలుసుకుందాం.. !!సరైన రక్షణ లేకుండా ఎండ, కాలుష్యం, వర్షపు నీరు, ధూళి అధికంగా మీ జుట్టుపై పడటం వల్ల మీ జుట్టు పొడిగా, పెళుసుగా అవుతుంది. జుట్టును వీలైనంత వరకూ రక్షించుకోవడానికి ప్రయత్నించాలి. ఒకవేళ ఎప్పుడైనా వర్షం లేదా ధూళి జుట్టుపై పడితే, అదే రోజు తప్పనిసరిగా తలస్నానం చేయాలి.



మీరు షాంపూతో తలస్నానం చేసిన తర్వాత మీ జుట్టుకు మంచి పోషణను ఇచ్చే కండీషనర్‌ను అప్లయ్ చెయ్యండి. అలాగే, కండీషనర్ ను వాష్ చేసేటపుడు చల్లటి నీటిని ఉపయోగించటానికి ప్రయత్నించండి.అధిక తేమ స్థాయిలు జుట్టును రింగులు పడేట్లు చేస్తాయి. అలాగే జుట్టు రాలడానికి కూడా కారణం కావచ్చు. కండీషనర్  అప్లయ్ చెయ్యడం వల్ల మీ జుట్టు మృదువుగా మారి రింగులు పడవు. అప్పుడు జుట్టు చూడటానికి చాలా అందంగా ఉంటుంది. మీ హెయిర్ స్టైల్ మంచిగా ఉంచుకోండి. దీని వల్ల మీ జుట్టు చిక్కులు పడకుండా ఉంటుంది. కఠినమైన వాతావరణ పరిస్థితులలో, ప్రతి ఒక్కరు వారి జుట్టును టోపీ లేదా కండువాతో కప్పుకోవాలి.



అలాగే జుట్టు తడిగా ఉన్నప్పుడు జుట్టును విడదీయడానికి పెద్ద పెద్ద వెడల్పైన పళ్ళు ఉన్న దువ్వెనలను ఉపయోగించండి.మీ జుట్టు దువ్వేటప్పుడు మొదట జుట్టును చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి ఆ తర్వాత జుట్టు చివరి భాగం నుండి నెమ్మదిగా,  చాలా సున్నితంగా దువ్వడం మొదలు పెట్టాలి.చివరి భాగం దువ్వడం పూర్తయ్యాక పైభాగంలో దువ్వడం ప్రారంభించాలి. ఇలా దువ్వడం వలన చిక్కులు సులభంగా పోతాయి. దీని వల్ల జుట్టు ఎక్కువగా డామేజ్ కాదు. జుట్టు ఊడటం తగ్గుతుంది.మనం జుట్టును ఎంత జాగ్రత్తగా చూసుకున్నా మంచి డైట్ ఫాలో అవ్వడం తప్పనిసరి. జుట్టు పెరుగుదలను పెంచడానికి మరియు జుట్టు ఒత్తుగా, దృఢంగా ఉండటానికి మీరు మంచి డైట్ ను పాటించాలి. ప్రోటీన్లు, క్రొవ్వులు, విటమిన్లు,  ఖనిజాలతో నిండిన సరైన పోషకాలను తీసుకోవాలి.మీ ఆహారంలో విటమిన్ ఎ, బి, సి, మెగ్నీషియం, ఐరన్, జింక్ మరియు కాల్షియం చేర్చడం మంచిది, పాలకూర, చిలకడ దుంపలు, క్యారెట్, పాలు, పాల పదార్ధాలు, గ్రుడ్లు, ఓట్స్, వాల్ నట్స్, చేపలు వంటివి తినాలి. దీని వల్ల మీరు ఆరోగ్యంగా బలంగా ఉంటారు. దీంతో జుట్టు రాలటం తగ్గి మీ జుట్టు ఒత్తుగా, బలంగా పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: