అలాగే టొమాటో ముక్కలు, పాలకూర, క్యారెట్ ముక్కలు వేసి మెత్తగా బ్లైండ్ చేసుకోవాలి. తరువాత ఇందులో కొంచెం మిరియాలు పొడి, ఉప్పు కలిపుకుని తాగాలి. ఈ జ్యూస్ కూడా ఆరోగ్యానికి అలాగే బరువు తగ్గడానికి ఎంతో మంచిది.
అలాగే ఒక బీట్ రూట్, ఒక కట్ట పాలకూర, గుప్పెడు కొత్తిమీర ఆకుల్ని నీటితో కలిపి జ్యూస్ లా చేసుకోవాలి. దీనిలో కాస్తంత ఉప్పు కలిపి సేవించాలి.అలాగే పండ్లతో కూడా జ్యూస్ చేసుకుని తాగితే బరువు తగ్గుతారు తెలుసా.. !! ఓ యాపిల్ తీసుకుని ముక్కలుగా కోసి మిక్సీ జార్ లో వేయాలి.అలాగే అందులో ఒక అరటిపండు, నీళ్లు కలిపి జ్యూస్ లా చేసుకోవాలి. దీనిలో కొద్దిగా నిమ్మరసం పిండి, చిటికెడు ఉప్పు వేసి తాగేయాలి.
యాపిల్, కీరా, పాలకూరల్ని నీళ్లతో కలిపి జ్యూస్ చేసుకోవాలి. దీనిలో కాస్త నిమ్మరసం, ఉప్పు కూడా కలిపి తాగాలి.ఈ జ్యూసుల్నీ రోజుకొకటి చొప్పున పడగడుపున తాగి చూడండి. శరీరంలోని అదనపు కొవ్వు కరిగిపోయి మెల్లమెల్లగా బరువు తగ్గిపోతారు. ఈ జ్యూస్ తాగేటప్పుడు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి..ఈ జ్యూస్ తాగలేకపోతున్నాం అని తియ్యదనాన్ని వీటిలో చక్కెర మాత్రం కలపకండి.. పంచదార కలుపుకుని తాగితే మాత్రం తాగితే ఉపయోగం ఉండదు.