
గర్భిణీ స్త్రీలకు క్యాల్షియం ఫుడ్ చాలా అవసరం. ముఖ్యంగా తల్లి గర్భంలో పెరిగే శిశువులో దంతాలు, ఎముకలు, కండరాల ఏర్పాటు పెరుగుదలకు పెరుగు చాలా అవసరం. కాబట్టి, పాలను పాల ఉత్పత్తులను తీసుకోమని ఎక్కువ సలహాలిస్తుంటారు.గర్భిణీ స్త్రీలు పెరుగు తీసుకోవడం వల్ల వివిధ రకాల ప్రయోజనాలున్నాయి. ఎందుకంటే పెరుగులో క్యాల్షియం అధికంగా ఉంటుంది.అలాగే పెరుగు జీర్ణక్రియ ప్రక్రియను మెరుగు పరచడంలో చాలా ఉపయోగపడుతుంది. గర్భధారణ సమయంలో శరీరానికి అవసరం అయ్యే క్యాల్షియం, ప్రోటీన్స్ ను పెరుగు అందిస్తుంది. ఇవి బేబీ పెరుగుదలకు చాలా అవసరం అవుతాయి. గర్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీలకు కాల్షియం సంవ్రుద్దిగా లేనట్లైతే వెంటనే క్యాల్షియం తీసుకోవడం ప్రారంభించండి. డైరీ ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల తల్లి బిడ్డ ఇద్దరికీ ఆరోగ్యకరం. ముఖ్యంగా పెరుగులో మంచి బ్యాక్టీరియా(ప్రోబయోటిక్స్)అధికంగా ఉంటుంది. ఇది మనశరీరంలోని హానికరమైన బ్యాక్టీరియాను తొలగించడానికి సహాయపడుతుంది .
గర్భధారణ సమయంలో పెరుగు తినడం వల్ల వ్యాధినిరోధక శక్తి అనేది పెరుగుతుంది.. స్పైసీ ఫుడ్ తో పాటు పెరుగు తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల శరీరం చల్లబడుతుంది . పెరుగు తినడం వల్ల శరీరంలోని వేడి తగ్గుతుంది. గర్భధారణ సమయంలో స్పైసీ ఫుడ్ తీసుకున్నప్పుడు, పెరుగు తినడం వల్ల ఎసిడిటి, హార్ట్ బర్న్ నివారించవచ్చు.గర్భధారణ కాలంలో పెరుగు తినడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గించుకోవచ్చు. పెరుగు ఒత్తిడిని తగ్గిస్తుంది. గర్భధారణ సమయంలో మొదడు చురుకుగా పనిచేయడం వల్ల భావోద్వేగాలకు గురి చేస్తుంది. ఈ సమస్య నివారించుకోవడానికి పెరుగు గ్రేట్ గా సహాయపడుతుంది.అందుకనే గర్భధారణ సమయంలో నిస్సందేహంగా పెరుగు తినవచ్చు.