
8 వ నెలలో మీ బిడ్డ పుట్టడానికి సిద్ధం అవుతూ ఉంటుంది. ఈ సమయంలో చాలా వరకు బిడ్డ తమ తలను క్రిందివైపునకు తిప్పి ఉంటారు. మీ బిడ్డ మీ కటిప్రదేశంలోకి జారినట్లుగా మీరు గమనించవచ్చు. దీనివలన శ్వాస తీసుకోవడం సులభమవుతుంది.ఎందుకంటే నెలలు నిండకముందు బిడ్డ పొట్ట లోపల ఉంటుంది.అందుకనే శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. అదే నెలలు నిండకా బిడ్డ స్థానం కిందకు వస్తుంది. అప్పుడు శ్వాస తీసుకోవడం సులభం అవుతుంది. అలాగే బిడ్డ కిందకు దిగినప్పుడు తరచుగా మూత్రవిసర్జన కూడా చేయాల్సిన అవసరముంటుది.అలాగే మీ కాళ్ళ మధ్యలో క్రింది భాగాన, మీ బిడ్డ తల ఉన్నట్లుగా అనిపించిన చోట మీకు వాపు కలుగవచ్చు. వాపు తగ్గడానికి, మీ కాళ్ళు దిండుపై ఉంచి పడుకుని విశ్రాంతి తీసుకోండి.
ఇప్పుడు మీ బిడ్డకు తన అంతర్గత శరీరభాగాలన్నీ పూర్తిగా ఏర్పడి ఉంటాయి. మీలోపల, అతను మీ గర్భంలోని ద్రవాన్ని మింగుతూ ఉంటాడు. తిరిగి దానిని విసర్జిస్తూ ఉంటాడు. అతని ఊపిరితిత్తులు పూర్తిగా తయారవుతాయి, అతను తన మొదటి శ్వాసతీసుకోవడంతోటే అవి పనిచేయడం ప్రారంభిస్తాయి.ప్రతి రోజూ విశ్రాంతీ తీసుకోవడానికి ప్రయత్నించండి. మీబిడ్డ గురించి ఆలోచించండి. తొందరలో మీరు అతనిని చూడబోతున్నారు. మీ బిడ్డ మీ గొంతును వినగలడు. అంతేకాదు మీరు మొదటి సారిగా అతనితో మాట్లాడిపుడు మిమ్మల్ని గుర్తు పడుతాడు! కదలికలు మీకు కొంచెం పెద్దగా అనిపిస్తాయి. కానీ మీ బిడ్డ మిమ్మల్ని క్రమం తప్పకుండా తన్నడం మీకు తెలుస్తూ ఉండాలి. ఇది తెలుసుకోవాలంటే అన్నం తిన్న తర్వాత కాసేపు నిదానంగా కూర్చోండి అతను ఎన్ని సార్లు తంతున్నాడో మీకు తెలుస్తుంది. మీ బిడ్డ ఎక్కువగా కదలకపోతే మీ హెల్త్ వర్కర్ ను మీరు సంప్రదించాలి.