ఎలా శుభ్రం చేసుకోవచ్చో ఒకసారి తెలుసుకుందాం.. !!
స్టవ్ మీద మొండి మరకాలు, నూనె జిడ్డు ఎక్కువగా ఉంటే వేడి నీటిలో , డిటర్జెంట్ పౌడర్ వేసి ఒక క్లోత్ ముంచి స్టవ్ ని ఆ వెనుక ఉండే గోడని కూడా తుడుచుకోవచు..ఒకవేళ స్టవ్ మీద బాగా జిడ్డు పట్టేసి ఉంటే ముందుగా గ్యాస్ స్టవ్ మీద వంటసోడా ను చల్లండి. ఆ తర్వాత నీటిలో డిటర్జెంట్ వేసి స్పాంజ్‌ను అందులో తడిపి స్టవ్‌ను శుభ్రం చేస్తే…దాని మీద పేరుకుపోయిన మరకలు, జిడ్డు పూర్తిగా తొలగిపోతాయి .
ముందుగా జిడ్డు మరకలున్న చోట కొన్ని చుక్కల వెనిగర్ వేసి మూడు నిముషాల పాటు అలాగే నాననివ్వాలి. తరువాత దానిపై ఒక స్పాంజీ తీసుకుని తుడిస్తే మరకలు ఉరికనే పోతాయి. అలాగే ఇంకొక పద్ధతి గురించి తెలుసుకుందాం.. !!ముందుగా మొండి మరకలన్నీ ఒక గుడ్డతో వేడినీటి తో తుడిచేసి తరువాత బేకింగ్ సోడాని చల్లాలి. ఆ పైన నైలాన్ వస్త్రం లేదా ఒక స్క్రబ్బింగ్ స్పాంజీ తో దాన్ని గట్టిగా రుద్ది కొద్దిసేపటి తరువాత వేడినీటితో మళ్ళీ కడగాలి. అప్పుడు మార్బుల్ పై జిడ్డు తేలికగా పోతుంది. వంట గదిలో ఎక్కడైనా ఏమైనా మరకలు గా అనిపిస్తే ఇలా చేసి చుడండి. గిన్నెలు కడగడానికి ఉపయోగించే లిక్విడ్ లో బ్లీచ్ ఉండడం వలన కొన్ని రకాల మరకలను పోగొట్టడానికి సహాయపడుతుంది. ఈ ద్రావణాన్ని మరకల పై చల్లి స్పాంజీ తో రుద్ది కడిగే స్తే మరకలు తొలగిపోతాయి.
అలాగే వంటగది లో వాడే నూనె డబ్బా యొక్క జిడ్డు పోవాలంటే కొంచెం వేడి నీటిలో గిన్నెలు కడగడానికి ఉపయోగించే లిక్విడ్ వేసి కడిగితే జిడ్డు తొలగిపోతుంది. అలాగే వంటగది స్లాబ్ పై ఉన్న జిడ్డైన గ్రీజు మరకలను తొలగించడానికి, మీరు కొన్ని నిమ్మరసమును పిచికారీ (స్ప్రే) చేయవచ్చు. టీ పాత్రలను శుభ్రం చేయడానికి, చెత్త బుట్టల నుండి వచ్చే చెడు వాసనను నిర్మూలించడానికి దీనిని వాడాలి. చూసారు కదా లేడీస్.. !! ఇంకెందుకు ఆలస్యం మీ చేతికి పని పెట్టండి.. మీ వంట గదిని శుభ్రం చేసేయండి.. !! .