చర్మ సౌందర్యం కోసం చాలామంది ఆడవాళ్లు బయట దొరికే  ఏవేవో లోషన్స్‌ వాడుతుంటారు. వీటివల్ల కొన్నిరోజులకు ముఖం అందం కాస్త  పాడవుతుంది. ఇలా మార్కెట్లో దొరికే వాటిలో కెమికల్స్ కలుపుతారు. అందుకనే వాటిమీద  ఆధారపడకుండా ఇంట్లోనే సహజ సిద్ధంగా కొన్నింటిని తయారు చేసుకోవచ్చు. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకోండి.. !తేనె తెల్లని చర్మకాంతిని అందిస్తుంది. తేనెను ముఖంపై రోజుకు రెండుసార్లు రుద్దడం వల్ల ముఖం మెరుస్తుంది. నిమ్మకాయ ఒక సహజసిద్ధమైన బ్లీచింగ్‌ ఏజెంట్‌. ఆరు వారాల పాటు  నిమ్మరసాన్ని ముఖానికి రుద్దడం వల్ల ముఖచర్మంపై పేరుకుపోయిన మలినాలు తొలిగిపోతాయి. ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది.



అలాగే కీరదోస కాయ ముక్కలతో  ముఖాన్ని రుద్దుకోవాలి. ఇలా చేస్తే ముఖం మీద ఉన్న బ్లాక్‌హెడ్స్‌ తొలిగిపోతాయి. కీరదోస ముక్కల్ని అలసిన కండ్లమీద పెట్టుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది. కీరదోస గుజ్జును ముఖానికి అప్లై చేయడం వల్ల నల్లమచ్చలు తొలిగే అవకాశం ఉంది.అలాగే  తులసి ఆకులను బాగా ఎండబెట్టి చూర్ణంలా చేయాలి. ఇందులో కొన్ని నీళ్లు కలపాలి. ఆ తర్వాత ముఖానికి పట్టించాలి. ఎండిన తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారంలో రెండురోజులు చేస్తే ముఖం మెరుస్తుంది.



కప్పు పాలల్లో కుంకుమ పువ్వుని కలపాలి. దాన్ని వలయాకారంలో ముఖం మీద రాయాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.రెండు టీ స్పూన్ల అరటిపండు గుజ్జులో ఒక టీ స్పూన్ తేనె, టీ స్పూన్ పచ్చిపాలు కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఐదారు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మం కాంతిమంతంగా ఉంటుంది. ఒక్కొక్క టీ స్పూన్ వెన్న, ఓట్స్ పొడిలో అయిదారు చుక్కల నిమ్మరసం కలిపి, ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం నునుపుదేలుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: