గర్భవతిగా ఉన్నప్పుడు గర్భిణీ స్త్రీకి ఎటువంటి ఆహారం పెట్టాలో బార్లీ గురించి అందరికీ తెలుసు. ఇది బాగా పాపులర్ అయినటువంటి త్రుణధాన్యం, బార్లీలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అయితే బార్లీ గర్భిణీల ఆరోగ్యానికి సురక్షితమేనా..? కదా అనే విషయంపై చాలా అపోహలు కలవు. ఎందుకంటే మహిళ గర్భం పొందిన తర్వాత ఎలాంటి ఆహారాలు తినాలి ఎలాంటి ఆహారాలు తినకూడదన్న విషయంలో చాలా గజిబిజి ఉంటుంది.  ప్రతి ఒక్క విషయంలో శ్రద్ద వహిస్తారు. ఆరోగ్యకరంగా ప్రసవించే వరకూ ఏకాగ్రత, జాగ్రత్తలు కలిగి ఉంటారు. కొంత మంది అభిప్రాయం ప్రకారం గర్బిణీలకు బార్లీ వాటర్ అత్యంత ప్రయోజనకారి అని అంటారు. గర్భిణీ స్త్రీ బార్లీ వాటర్ తాగడం వల్ల ఏమేమి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. బార్లీలో ఎక్కువగా  ప్రోటీన్లు, కార్పోహైడ్రేడ్లు, కొవ్వులు,  విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. అందుకనే గర్భిణీలు  సూప్‌లలో, పాలలో బార్లీ వాడటం ద్వారా  ఆరోగ్యానికి, శక్తికి దోహదం చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.



బార్లీ వాటర్ రెగ్యులర్ గా తాగడం వల్ల శరీరానికి కావల్సిన క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియంలు అందుతాయి. ఇవి మీకు అలాగే మీ బిడ్డకు ఎంతో ఆరోగ్యకరం.. !! బార్లీ వాటర్ లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకం , హెమరాయిడ్స్ వంటి గర్బధారణ సమయంలో వచ్చే సీరియస్ మెడికల్ కండీషన్స్ ను నివారిస్తుంది. నియాసిన్ బ్లడ్ క్లాట్స్ ను నివారిస్తుంది. దాంతో ప్రసవం సురక్షితం అవుతుంది. బార్లీ వాటర్ లో డ్యూరియాటిక్ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల యూరినేషన్ రేట్ ను పెంచుతుంది. దాంతో గర్బిణీ స్త్రీ శరీరంలో ఎక్కువ నీరు చేరకుండా , కాళ్ళు వాపులు రాకుండా చేస్తుంది. గర్భిణీగా ఉన్నపుడు శరీరంలో అధిక నీరు చేరుతుంది.  ఆ నీరు పోవాలంటే బార్లీ నీరు తాగాలి. అందువల్ల బార్లీని నీళ్ళల్లో నాన్నబెట్టి రోజూ తాగితే మంచిది.



బార్లీని రవ్వలాగా, మెత్తటి పిండిలా చేసి దానితో చేసిన ఆహార పదార్దాలను తింటే త్వరగా, తేలిగ్గా జీర్ణమవుతాయి. బార్లీ నుండి తీయబడిన నూనెను వాడితే శరీరంలోని కొలెస్టరాల్ శాతం తగ్గుతుంది. బార్లీలో ఉండే గ్లిసమిక్ ఇండెక్స్ బ్లడ్ షుగర్ లెవల్స్ ను మెయింటైన్ చేయడానికి , గర్భధారణ సమయంలో వచ్చే జస్టేషనల్ డాయబెటిస్ ను దూరం చేయడానికి సహాయపడుతుంది. బార్లీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల పొట్టలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. శరీరం నుండి వ్యర్థాలను ఫ్లష్ అవుట్ చేస్తుంది. అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ నుండి  మిమ్మల్ని మీ బిడ్డని సురక్షితంగా రక్షిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: