ఇరిటేట్ అయి ఉన్న స్కిన్ ని ఫేస్ పాక్స్ చల్లబరుస్తాయి ఫేస్ పాక్స్ స్కిన్ ఏజ్ అయ్యే ప్రాసెస్ ని స్లో డౌన్ చేస్తాయి. పొల్యూషన్, హార్ష్ వెదర్ వంటి వాటి వల్ల ముందు ఎఫెక్ట్ అయ్యేది స్కిన్ మాత్రమే. ఇందు వల్ల చర్మంలోని కాంతి అంతా పోతుంది. ఫేస్ పాక్స్ ఫ్రీ రాడికల్స్ తో పోరాడి బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచుతాయి. ఫలితంగా స్కిన్ స్మూత్ గా షైనీ గా తయారవుతుంది.. ఫేస్ పాక్స్ వల్ల ఇతర స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఎఫెక్టివ్ గా పని చేస్తాయి. ఫేస్ పాక్స్ స్కిన్ ని తయారుగా ఉంచుతాయి, స్కిన్ కేర్ యొక్క బెనిఫిట్స్ పొందడం కోసం క్రమం తప్పకుండా వేసుకుంటూ ఉండాలి . ఫేస్ పాక్స్ ఎంత నాచురల్ వి అయినా కూడా అందరికీ ఇవి పడతాయన్న గ్యారంటీ ఏమీ లేదు.
అందుకని ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తరువాతే వీటిని వాడాలి. అలాగే చర్మాన్ని కాపాడుకోవడానికి బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా సన్‌స్క్రీన్ యూజ్ చేయాలి..అంతేకాకుండా ఎప్పటికప్పుడు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటూ ఉండాలి. అలాగే మీరు ఆనందించే విషయాల కొరకు కొంత సమయం కేటాయించుకోండి. ఆడవాళ్లు ముందుగా ఒత్తిడిని దూరం చేయాలి. ప్రతిరోజు మీ చర్మం గురించి కేర్ తీసుకోకపోయినా కనీసం వారానికి నాలుగు సార్లు అయిన తీసుకోండి. అలాగే మీ చర్మానికి ఎటువంటి ఫేస్ మాస్క్ సెట్ అవుతుందో తెలుసుకుని దాన్ని ఎంచుకోండి.. !!