
ఎక్కువ బరువు ఉన్న ఆడవాళ్ళు తమ బరువు మాములుగా ఉంచుకోటానికి ఆహార పత్యాలను పాటించటానికి ప్రయత్నిస్తారు. అదేవిధంగా వారు తీసుకునే ఆహారంలో ఎక్కువ పోషకాలను తక్కువ క్యాలోరీలని తీసుకోవాలి. అలాగే ఎక్కువ బరువు ఉన్న గర్భిణీ స్త్రీలు కింద పేర్కొన్న ఆహార పత్యాలను పాటించటం మంచిది. తీసుకొనే పాల పదార్థాలలో తక్కువ ఫాట్ అనగా తక్కువ బిగువు పాలు, తక్కువ యొగార్ట్ ఉండేలా చూసుకోవాలి. వీలైనంత తక్కువగా ఉప్పు తీసుకోవాలి. అలాగే ఫ్రైడ్ చేసిన ఆహరం కంటే కాల్చిన ఆహార పదార్థాలు ఆరోగ్యానికి చాలా మంచివి.ఎక్కువగా నూనెలో వేపిన ఆహారపదార్ధాలుకు దూరంగా ఉంటే మంచిది. అలాగే గర్భిణీ స్త్రీలు సలాడ్ లను తినడం కూడా మంచిదే.ఎక్కువగా పచ్చని ఆకుకూరలు లేదా పండ్లతో తీసుకోవటం మంచిది.
అలాగే కొంతమంది గర్భిణీ స్త్రీలు వాళ్ళ శరీరంలో అధిక నీరు చేరడం వల్ల బరువు పెరుగుతారు. అలా అని నీరు తాగకుండా మాత్రం ఉండకూడదు. శరీరం నుండి ఎక్కువగా నీరు ఆవిరి అవుతుంది, కావున ఎక్కువ మొత్తంలో నీటిని తీసుకోండి. ఎక్కువ బరువు ఉన్న ఆడవాళ్ళు గర్భసమయంలో ఆహార నియమాలనే కాకుండా కొన్ని పనులని కుడా చేయటం మంచిది. మీ వైద్యుడి సలహా ప్రకారం నడవటం, స్విమ్మింగ్ లని చేయాలి. ఎక్కువ బరువు ఉన్న ఆడవాళ్ళు గర్భసమయంలో కొన్ని ఆహరాలని తినకపోవటం మంచిది. ఇలా ఆహారం పట్ల జాగ్రత్త వహించటం వలన మీ పుట్టబోయే శిశువుకి మంచిది.