ప్రస్తుత కాలంలో ఆడవాళ్లు ఎదుర్కునే ప్రధాన సమస్యల్లో అధిక బరువు ఒకటి. శరీరం బరువుతో పాటు పొట్ట కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. దినితో వాళ్ళు చూడడానికి మరింత ఎబ్బెట్టుగా ఉంటారు.అసలు ఎలాఆడవాళ్ళ పొట్ట పెరగడానికి కారణం ఏంటంటే  గంటల పాటు కంప్యూటర్ల ముందు కూర్చోవడం, శారీరక శ్రమ తగ్గిపోవడం, ఇంట్లో పనులకు పని మనుషులకు పెట్టుకోవడం, ఫలితంగా బరువు పెరగడం జరుగుతోంది. కాస్త లావైనా వెంటనే పొట్ట ముందుకు పొడుచుకు వస్తుంది. ఇక ఆ తర్వాత ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అందుకే పొట్టను నియంత్రించుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.అందుకే ఒబిసిటీని నియంత్రించడంతో పాటు పొట్ట పెరగకుండా సరైన ఆహారంతో పాటు, వ్యాయామం కూడా  చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. అందుకే పొట్ట పెరగకుండా ఉండాలంటే ఆడవాళ్లు తప్పనిసరిగా ఇవి పాటించాలిసిందే.! 





ముందుగా మీరు తీసుకొనే ఆహారంలో ఉప్పు తీసుకోవడాన్ని తగ్గించాలి. ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి.  ఉప్పు ఎంత తగ్గువ  వాడితే అంతగా పొట్ట పెరగకుండా ఉంటుంది. దానికి తోడు బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది. అలాగే  మీ పొట్టను కరిగించుకోవాలంటే నిద్ర తప్పనిసరి. రోజుకు 8 గంటలు తప్పక నిద్రపోవాలి. పొట్ట తగ్గాలనుకునేవారు పొట్ట తగ్గడం కోసం బోర్లా పడుకుని నిద్రించడం మంచిది. తద్వారా పొట్ట కండరాలు లోనికి చొచ్చుకోవడం ద్వారా కొవ్వు విచ్ఛిన్నం అవుతుంది. నిద్ర పోవచ్చు అన్నారు కదా అని విపరీతంగా పనుకోకూడదు. అతి నిద్ర కూడా ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. అలాగే కూరగాయలు కూడా మీరు ఎక్కువగా గ్రీన్ వెజిటేబుల్స్‌ తీసుకోవాలి. తాజాగా ఉండేలా చూసుకోవాలి. బ్రొకోలి, కాకరకాయ, క్యాబేజ్ జ్యూస్ వంటివి తీసుకోవడం ద్వారా  మీరు త్వరగా బరువు తగ్గడానికి పొట్ట కరిగించుకోవడానికి సహాయపడుతాయి. పొట్ట తగ్గాలంటే కచ్చితంగా ఫ్యాట్ ఫుడ్స్‌ను తినడం పూర్తిగా నివారించాలి.





 జంక్ ఫుడ్, ఫ్త్రెడ్ ఫుడ్, చిప్స్ వంటి వాటికి మీరు దూరంగా ఉండాల్సిందే. పొట్టకు సంబంధించిన వ్యాయామాలు
మీకు సమయం దొరికినప్పుడల్లా మీ బెల్లీ తగ్గడానికి, పొట్టకు సంబంధించిన వ్యాయామాలు చేయండి. మీ నడుమును సైడ్ టు సైడ్ తిప్పుతుండాలి. బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి ఇది ఒక సులభ వ్యాయామం. మెడిటేషన్ భంగిమలో లోతుగా శ్వాస పీల్చడం వల్ల పొట్టను తగ్గించుకోవచ్చు. శ్వాస వ్యాయామాన్ని పాటించడం ద్వారా కూడా పొట్టను తగ్గించుకోవచ్చు. ఆడవాళ్ళ బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవాలంటే నీళ్ళు తరుచుగా తాగుతూ ఉండాలి.  ఎక్కువగా నీళ్ళు త్రాగడం వల్ల ఫ్లాట్ బెల్లీని తగ్గించుకోవచ్చు. రోజుకు మూడు నుంచి ఐదు లీటర్ల నీరు తాగితే పొట్ట తగ్గుతుంది. అలాగే సైక్లింగ్ ద్వారా పొట్టను బాగా తగ్గించుకోవచ్చు. ప్రతిరోజూ ఓ గంట పాటు సైక్లింగ్ చేయడం ద్వారా కేవలం 14 రోజుల్లోనే శరీరాకృతిలో మార్పును మీరు గమనించవచ్చును.








మరింత సమాచారం తెలుసుకోండి: