హెయిర్ కేర్..
ప్రసవం తరువాత జుట్టు ఊడటం కొనసాగుతుంటే అందుకు చాలా జాగ్రత్తలు పాటించాలి అంటూ అంటున్నారు..
హెయిర్ వాష్ కోసం హాట్ వాటర్ ను ఉపయోగించవద్దు. గోరువెచ్చటి లేదా చల్లటి వాటర్ ను వాడండి.
జుట్టు తడిగా ఉన్నప్పుడు దువ్వడం, బ్రష్ చేయడం అలాగే పైకి కట్టేయడం వంటివి చేయకూడదు. హెయిర్ అనేది పూర్తిగా ఆరేవరకు లూజ్ గా ఉంచాలి.
జుట్టును వారానికి రెండు లేదా మూడు సార్లు మంచి షాంపూ తో తల స్నానం చేయాలి..
పదే పదే తలను దువ్వడం లేదా టైట్ గా ఉండే జడలు వేసుకోవడం చేయకూడదని నిపుణులు అంటున్నారు.
హెల్తీ డైట్..
హెయిర్ హెల్త్ విషయానికి వస్తే డైట్ అనేది డైరెక్ట్ ప్రభావం చూపిస్తుంది. మంచి ఆహారాన్ని తీసుకుంటున్నారంటే శిరోజాల ఆరోగ్యం బాగున్నట్టేనని అర్థం. డైట్ ఆరోగ్యకరంగా లేకపోతే హెయిర్ ఫాల్ ప్రారంభమవుతుంది.
ప్రోటీన్ తో పాటు ముఖ్యమైన విటమిన్స్ అలాగే మినరల్స్ పుష్కలంగా ఉండే డైట్ ను తీసుకోవాలి. విటమిన్స్ ఏ, బీ, సి అలాగే ఈ పుష్కలంగా ఉండే డైట్ ను తీసుకోవాలి. అలాగే ఐరన్, జింక్, కాపర్, మెగ్నీషియం అలాగే సెలీనియంలు సమృద్ధిగా లభించే ఆహారాలను తీసుకోవాలి. ఐరన్, జింక్ లేదా ఏదైనా ఇతర ముఖ్యమైన పోషకాలు తక్కువగా ఉన్నట్టయితే హెయిర్ లాస్ ప్రారంభం అవుతుంది.మంచి ఆరోగ్య కరమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
ఒత్తిడి తగ్గించుకోండి..
నిజానికి, ఒత్తిడి వల్ల పోస్ట్ పార్టమ్ హెయిర్ లాస్ అనేది మరింత పెరిగే అవకాశం ఉంది. సాధారణ హెయిర్ సైకిల్ ను ఒత్తిడి డిస్టర్బ్ చేస్తుంది. అందుకే ఒత్తిడిని నియంత్రణలో ఉంచుకోవాలి.
ప్రసవం జరిగిన తరువాత ఒత్తిడికి గురవడం సహజమే. ఎన్నో కొత్త బాధ్యతలను చూసుకోవాల్సి ఉంటుంది. ఐతే, ఒత్తిడి అనేది హెయిర్ హెల్త్ కు మంచిది కాదు.
సరిగ్గా నిద్ర పోవాలి లేకుంటే శరీరం మరింత గా నీరసం అవుతుంది.. ఇలా చేయడం వల్ల జుట్టు రాలే సమస్య పూర్తిగా తగ్గిపోతుంది..