రుజుతా ఇటీవలే తాను రాసిన ‘ఈటింగ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ డైటింగ్’ పుస్తకంలో డైటింగ్ గురించి, డైటింగ్ చేసే వారు ఆహారం తీసుకోవడం గురించి చాలా విషయాలు వెల్లడించింది. ముఖ్యంగా డైటింగ్ చేసే వారు ఆహారం తినే విషయంలో కొన్ని నియమాలు పాటించాలని చెప్పారు. మరి ఆమె చెప్పిన గోల్డెన్ సలహాలు, వాటి వివరాలు తెలుసుకోవాలని ఎవరు అనుకోరు చెప్పండి. గత పదేళ్లుగా సోషల్ మీడియాలో ఆమె చాలా హెల్త్ టిప్స్ చెప్తూనే వచ్చారు. వాటిలో సీజనల్ ఫుడ్స్, ఆరోగ్యం గురించి పలు ఆసక్తికర విషయాలను రాసుకొచ్చారు. వీటన్నింటినీ ఇప్పుడు ఒక చోట పేర్చి ఈ పుస్తకం చేశారు. రుజుతా చెబుతున్న ఆ గోల్డెన్ టిప్స్ ఏంటో ఓసారి మనం కూడా చూసేద్దామా?
1. ఆహారాన్ని ఒక గొప్ప వరంలా చూడాలి. ఆహారం వడ్డించుకునే సమయంలో రైతులతో సహా ఎందరికో కృతజ్ఞతలు చెప్పాలి. ఆహారాన్ని వృథా చేయొద్దు.
2. తినేది కొద్దిగానే అయినా సరే.. మనసు పెట్టి, రుచిని ఆస్వాదిస్తూ తినాలి. ఆకలి వేయడం అనేది సీజన్, మన ఆలోచన విధానం, నిద్ర సమయం, వ్యాయామ సమయం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే కొద్దిగా తిన్నా సరే ధ్యాస పెట్టాలి.
3. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, క్యాలరీలు మితి మీరి తీసుకోకూడదు. వాటిని కొంచెం దృష్టిలో ఉంచుకొని ఆహారం తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు స్థానిక, సీజనల్, సంప్రదాయ ఆహారమే తినాలి.