రెగ్యులర్ గా బ్లడ్ ప్రెజర్ చెక్ చేసుకోవటం అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఇక గర్భధారణ సమయంలో మహిళలు చాల ఒత్తిడికి గురవుతుంటారు. అయితే గర్భిణీ స్త్రీకి బీపీ 140/90 లేదా అంతకంటే మించినట్లయితే దాన్ని ప్రెగ్నెన్సీ ఇండ్యూస్ట్ హైపర్ టెన్షన్ అంటారు. అయితే హై టెన్షన్ కి గురైనప్పుడు లక్షణాలను బట్టి తెలుసుకోవచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ముందుగా గర్భిణీ స్త్రీలలో రక్తపోటు పెరుగుతుంది. శరీరానికి నీరు చేరుతుంది . పాదాలు వాపు, విశ్రాంతి తీసుకున్నా వాపు తగ్గకపోవడం. బరువు వారానికి అరకిలో లేక పదిహేను రోజులకు ఒక కిలో కంటే ఎక్కువ పెరగడం వంటివి జరుగుతాయి. ఇక మూత్రంలో అల్బుమిన్ పోతుందని చెబుతున్నారు.

ఇక కడుపులోని బిడ్డ బరువు పెరగకపోవడం, ఉమ్మనీరు తగ్గిపోవడం. బిడ్డకు రక్తప్రసరణ సరిగ్గా అందకపోవడం, మాయ ముందుగానే విడిపోయి రక్తస్రావం అవడం వల్ల బిడ్డ కడుపులోనే చనిపోవడం లాంటివి జరుగుతాయి. నెలలు నిండకముందే కాన్పు రావడం లేదా తల్లిని ప్రాణాపాయస్థితి నుంచి తప్పించడం కోసం కాన్పు ముందుగానే చేయాల్సి రావడం . అయితే ఇవ్వనీ బీపి ఎప్పుడు పెరిగింది, వ్యాధి తీవ్రత ఎంత అనేవాటి మీద ఆధారపడి ఉంటాయి.

ఇక క్రమం తప్పకుండా డాక్టర్ తో బీపీ, ఇతర చెకప్ లు చేయించుకోవాలి. బీపీ కొద్దిగా పెరగగానే త్వరత్వరగా చెకప్ చేయించుకుని, క్రమం తప్పకుండా మందులు వేసుకోవాలి. అవసరం అయితే హాస్పటల్లో అడ్మిట్ కావాలి. 3. బీపీ కొద్దిగా పెరిగినప్పుడు ఏ లక్షణాలు ఉండవు. ఎక్కువగా పెరిగే కొద్ది.. తలనొప్పి, వికారం, వాంతులు, ఛాతీ కింద నొప్పి, మూత్రం రావడం తగ్గిపోవడం, బరువు ఎక్కువగా పెరగడం, ఒంటిలో అధికంగా నీరు చేరడం, చూపు మందగించడం వంటివి ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి . దీనికి చికిత్స బీపి ముదిరి, సమస్యలు పెరగక ముందే ప్రసవం చేయాలి. అది కూడా వీలయితే నార్మల్ గా లేదంటే ఆపరేషన్ ద్వారా చేయాల్సి ఉంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: