అయితే గర్భాధారణ సమయంలో ప్రతిరోజూ ఉదయం కనీసం 38 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే డయాబెటిస్ వంటి వ్యాధులకు చెక్ పెట్టవచ్చని వారి అధ్యయనం స్పష్టం చేసింది. ఇలా వారానికి ఐదు రోజుల పాటు ప్రతి రోజు కనీసం 30 నిమిషాలు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ప్రెగ్నెన్సీ మహిళలు డయాబెటిస్కు దూరంగా ఉండవచ్చని అధ్యయనంలో వెల్లడించారు.
ఇక ఈ అధ్యయన ఫలితాలు డయాబెటిస్ కేర్ జర్నల్ లో ప్రచురించబడ్డాయి. కాగా, శాస్త్రవేత్తలు ప్రెగ్నెన్సీ ఎన్విరాన్మెంట్ అండ్ లైఫ్ స్టైల్ స్టడీలో భాగంగా 2,246 మంది గర్భిణీ స్త్రీల నుండి డాటాను సేకరించారు. ఈ అధ్యయనంలో గర్భిణీ స్త్రీలు రోజూ చేస్తున్న వ్యాయామాన్ని పరిగణలోకి తీసుకున్నారు. ప్రధానంగా, మొదటి త్రైమాసికంలో గర్భిణులు చేసే వ్యాయామ స్థాయిలపై ఈ అధ్యయనం కొనసాగింది.
అయితే రోజుకు కనీసం 38 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల గర్భిణులలో డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని అధ్యయనంలో పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం ప్రతీ 100 మందిలో ఆరు నుండి 10 మంది మహిళలు గర్భధారణ సమయంలో డయాబెటిస్ భారీన పడుతున్నారు. అందువల్ల, వ్యాయామంతో ప్రతీ 100 మంది మహిళల్లో కనీసం ఇద్దరికైనా డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని అధ్యయన రచయిత సమంతా ఎర్లిచ్ అన్నారు.