ఒక కుటుంభంలో కొడుకును ఏ విధంగా అయితే చూస్తామో కూతురు కూడా అంతే. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి అయితే అతడు వాలంటరీగా ఉద్యోగ విరమణ చేస్తే ఆ ఉద్యోగంలో కూతురుకు కూడా సమాన హక్కు ఇవ్వాల్సిందే. ఈ మేరకు అలహాబాద్ లోని హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది.  కారుణ్య నియామకాల్లో మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగి కొడుకు దక్కే హక్కులు ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటామో అదేవిధంగా కూతురును కూడా గుర్తించాలని ధర్మాసనం తీర్పు చెప్పింది..

కారుణ్య నియామకాల్లో కూతురు అర్హురాలు కాదని వచ్చిన ఓ కేసులో సంచలన తీర్పు చెప్పింది అలహాబాద్ హైకోర్టు. ఆ వివరాలోకి వెళ్తే..
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాగ్ జిల్లాలోని విధ్యాశాఖాధికారి ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఆ ఉద్యోగి కారుణ్య నియామకంలో కూతురును చేర్చవద్దని కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆ పిటిషన్ ను సవాల్ చేస్తూ మంజుల్ శ్రీ వాత్సవ్ అనే వ్యక్తి అలహాబాద్ కోర్టులో పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ ధర్మాసనం కారుణ్య నియామకంలో కూతురుకు ఎందుకు హక్కు ఇవ్వకూడదని ప్రశ్నించింది. కొడుకుకు ఉండే  సమానమైన హక్కు కూతురుకు కూడా ఉంటుంది అందులో సందేహంలేదని తేల్చి చెప్పింది.అంతేకాదు
పెళ్ళైన కొడుకు, పెళ్ళైన కూతురు ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి ఒక వేళ కూతురుకు పెళ్లైంది  వేరు అనుకుంటే కొడుకుకు కూడా పెళ్ళయ్యింది వేరేగా భావించాలిగా అంటూ ప్రశ్నలు సంధించింది. పెళ్ళైన కొడుకు అన్నిటికి అర్హుడే అలాంటప్పుడు కూతురు కూడా అర్హురాలే అంటూ తీర్పు చెప్పేసింది. గతంలో సుప్రీం కోర్టు తండ్రి ఆస్తిలో కూతురుకు కూడా అర్హత ఉందని తీర్పు చెప్పగా తాజాగా కారుణ్య నియామకాల్లో కూతురు కూడా అర్హురాలంటూ అలహాబాద్ కోర్టు తీర్పు చెప్పడం సంచలనం సృష్టిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: