అయితే గర్భం ధరించిన మెరుపు మహిళ ముఖంలో కనిపిస్తూ ఉంటే అబ్బాయనీ పుడతారని అంటారు. ఇక ముఖం డల్ గా, యాక్నే వచ్చి ఉంటే అమ్మాయి పుట్టబోతోందనీ అంటారు. తల్లి కాబోతున్న వారికి కొన్ని క్రేవింగ్స్ ఉంటాయి. కొన్ని ఫుడ్ ఐటమ్స్ మరీ నచ్చేస్తే కొన్ని అసలు నచ్చవు. మీరు తినే వాటిని బట్టి కూడా అమ్మాయా అబ్బాయా అని చెప్పవచ్చట. బాగా తియ్యగా తినాలని అనిపిస్తూ ఉంటే అమ్మాయనీ, పుల్లటివి కోరుకుంటే అబ్బాయి పుట్టబోతున్నాడనీ అంటారు.
ఇక మీరు నెక్స్ట్ టైమ్ డాక్టర్ విజిట్ కి వెళ్ళినప్పుడు మీ బేబీ హార్ట్ రేట్ గమనించండి. నిమిషానికి 140 బీట్స్ కంటే ఎక్కువ ఉంటే అమ్మాయట, తక్కువైతే అబ్బాయట. తల్లి కాబోతున్న ఆనందాన్ని వేవిళ్ళు మింగేస్తాయని అంటూ ఉంటారు. మూడో నెల తరువాత కూడా వేవిళ్ళు ఉంటే అమ్మాయని అంటారు. అయితే, ఎలాంటి కష్టమైనా చేతిలో ఉన్న బిడ్డని చూడగానే పోతుందనుకోండి.
అయితే మీ బెల్లీ బటన్ వైపు, పొట్ట చూట్టూతా ఒక డార్క్ లైన్ ఏర్పడితే అబ్బాయని అంటారు. కొన్ని మిత్స్ ప్రకారం పొట్ట పైకి ఉంటే అమ్మాయనీ, పొట్ట కిందకి ఉంటే అబ్బాయి అని అంటారు. నెలలు నిండుతున్న కొద్దీ పడుకోవడం కొద్దిగా అసౌకర్యం గా ఉంటుంది. ఎడమవైపు తిరిగి పడుకునే వారి పొట్టలో అబ్బాయి ఉంటాడనీ, కుడివైపు తిరిగి పడుకునే వారి పొట్టలో అమ్మాయి ఉంటుందని అంటారు.