తయారీలో వాడే పధార్థాలు : గ్రీన్ పీస్ : 1 కప్పు (ఉడికించినవి) పాలు : 1 కప్పు మైదా : అర చంచా కారం : అర చెంచా టొమోటా రసం: 2 చెంచాలు వేపిన జీలకర్ర పొడి : అర చెంచా జీలకర్ర : అర చెంచా ఇంగువ : చిటికెడు ఉల్లిపేస్టు : 3 చెంచాలు నూనె : 3 చెంచాలు నిమ్మరసం : 1చెంచా ఉప్పు : తగినంత తయారీ చేయువిధానం: ముందుగానే ఒక బౌల్ లో పాలు, మైదా, జీలకర్ర పొడి, టొమోటో రసం , కారం, నిమ్మరసం, వేసి బాగా కలిపి వుంచాలి. ఫ్యాన్ లో నూనె వేసి కాగిన తరువాత జీలకర్ర వేసి వేపాలి. వేగిన వీటికి ఇంగువ, ఉల్లి పేస్టు వేసి గరిటతోకలుపుతూ వేపాలి. ఉల్లిపేస్టు వేగిన తరువాత పాల మిశ్రమం, ఉడికించిన గ్రీన్ ఫీస్, సరిపడ ఉప్పు వేసి సన్నని మంట మీద 3 నిమిషాలు ఉడికించాలి. కర్రీ చిక్కబడిన తరువాత దించి రోటిలోకి వేడి వేడిగా సర్వ్ చేయాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: