
బాదం, హేజెల్‌నట్స్ వాల్‌నట్స్, వంటివి అన్నమాట. ఇవి మగాళ్లకు ఎంత మంచివంటే.. శుక్రకణాలకుబలాన్ని ఇవ్వడం తో పాటు శుక్రకణాలను చురుగ్గా చేస్తాయి. మొత్తంగా స్పెర్మ్ కౌంట్ పెంచుతాయి. ఓ కొత్త అధ్యయనం విషయాలుఆండ్రోలజీ అనే జర్నల్‌లో రాశారు. అందులో 14 వారాల రహస్యం బయటపెట్టారు. పైన చెప్పుకున్న చెట్ల నుంచి వచ్చే గింజలు, పప్పులు, బద్దల వంటి వాటిని 14 వారాల పాటూక్రమం తప్పకుండా రోజూ తింటే… శుక్రకణాల dna మారిపోతుందట. దాంతో14 వారాల తర్వాత,ఇంట్లో శుభవార్త వినిపిస్తుందట . ఇదిఊరికే చెప్పిన మాట కాదు. 72 మంది పురుషులపై ఈ పరిశోధన చేశారు. వారికి విదేశాల్లో పెట్టే రెడ్ మీట్, ప్రాసెసింగ్ ఫుడ్, షుగర్ ఎక్కువగా ఉండే పదార్థాలు ఆహారం గా ఇచ్చారు.
అయితే ఇవి తింటూ ఉంటే పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గిపోతాయి. 72 మందిలో నుండి 48 మందికి ప్రతి రోజూ 60 గ్రాముల ఉండే ట్రీ నట్స్ తప్పనిసరిగా తినమని సూచించారు. ప్రతి రోజూ తిన్నారా అని అడిగి మరీతినేలా చేసారు . అందులో 48 మంది తీసేయగా మిగిలిన 24 మంది ఈ ట్రీ నట్స్ తినకుండానే 14 వారాలూ గడిపేశారు .14 వారాల తర్వాత ఫలితం ఎలా ఉందంటే … ప్రాసెసింగ్ ఫుడ్డు తింటూ కూడా… రోజూ నట్స్ తినేవారిలో స్పెర్మ్ కౌంట్ అద్భుతం గా ఉంది. స్పెర్మ్ dna కూడా మారి.. చాలా చురుగ్గా తయారైంది.
ఇక ట్రీ నట్స్ తినని వారిలో మాత్రం స్పెర్మ్ కౌంట్ దారుణంగా పడిపోయింది అని తేలింది . కాబట్టి… పిల్లలు పుట్టని పురుషులు ట్రీ నట్స్ తినడంపై దృష్టి పెట్టడం వలన ఎంతో మేలు కలుగుతుంది . వాటితో పాటు గుమ్మడి కాయ గింజలు, డార్క్ చాక్లెట్లు, దానిమ్మపండు, జామకాయలు కూడా తింటూ ఉంటే త్వరలోనే మీ ఇంటిలో బుజ్జి పాపాయి వస్తుందట.