
అయితే కూడా ఇతరులతో పోలిస్తే, దీని బారిన పడే మహిళలు మధ్యవయసులో గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. వీరి గుండె ధమనుల్లో కాల్షియం అభివృద్ధి చెందే అవకాశం రెట్టింపు అవుతుందని అధ్యయనంలో కనుగొన్నారు. ప్రసవమైన తరువాత రక్తంలో చర్కెర స్థాయిలు అదుపులో ఉంటూ, ఎలాంటి ఇబ్బందులు లేనప్పటికీ, వారికి గుండె జబ్బుల ప్రమాదం మాత్రం ఎక్కువగానే ఉంటుందని పరిశోధకులు తెలిపారు.
ఈ అధ్యయనాన్ని జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌లో ప్రచురించారు. జెస్టేషనల్ డయాబెటిస్ బారిన పడి, కోలుకున్న వారి గుండె ధమనుల్లో కాల్షియం అభివృద్ధి చెందే సమస్య ఎక్కువగా కనిపిస్తోందని అధ్యయన బృంద సభ్యుడు ఎరికా గండర్సన్ తెలిపారు. ఆయన కాలిఫోర్నియాలోని కైజర్ పర్మనెంట్ సంస్థలో పనిచేస్తున్నారు. వీరి రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో ఉన్నప్పటికీ, గుండె జబ్బుల ప్రమాదం మాత్రం రెట్టింపుగా ఉంటుందని చెప్పారు.
అయితే టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ లేని 1,100 మంది మహిళలపై ఈ పరిశోధన చేశారు. వీరంతా గతంలో కనీసం ఒక్కసారైనా గర్భం దాల్చి, ప్రసవమైనవారే. 2011లో ముగిసిన ఈ అధ్యయనం 25ఏళ్ల పాటు కొనసాగడం విశేషం. ఈ మహిళలు గర్భం దాల్చడానికి ముందు, ప్రసవానికి ముందు, ఆ తరువాత.. ఇలా ప్రతి ఐదేళ్లకు ఒకసారి రక్త పరీక్షలు చేశారు. వీరి రక్తంలో చక్కెర స్థాయులను నమోదు చేశారు. వీరి గుండె ఆరోగ్యాన్ని కూడా ఎప్పటికప్పుడూ పరీక్షించారు. గుండె జబ్బులకు సంకేతంగా భావించే ధమనుల్లో కాల్షియం ఏర్పడే సమస్య గురించి ఆరా తీశారు.