సివిల్స్ సర్వీసెస్ ఎగ్జామ్ లో పాస్ కావాలంటే ఎన్నో సంవత్సరాల పాటు తపస్సు చేసినట్టు కృషి చేయాల్సి ఉంటుంది. టీవీలు, ఫోన్లు గట్రా ముట్టుకోకుండా రోజులో 20 గంటలపాటు చదివి ప్రతి చిన్న విషయాన్ని గుర్తు పెట్టుకొని ఎంతో ఆత్మవిశ్వాసంతో సంవత్సరాల తరబడి ముందుకు సాగటం సివిల్ సర్వీస్ అస్పిరంట్ యొక్క ముఖ్య లక్షణం. ఈ క్లిష్టతరమైన ఎగ్జామ్స్ లో పాస్ కావాలంటే చిన్న వయసునుంచే కష్టపడాల్సి ఉంటుంది. అయితే కొందరు ఆలస్యంగా కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి సక్సెస్ అయిన వారు ఉన్నారు. హర్యానాలోని సోనిపట్ కి చెందిన అను అనే ఒక యువతి కూడా ఆలస్యంగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది. చిన్నతనం నుంచి మెరిట్ స్టూడెంట్ అయిన ఈమె ఎంబీఏ చేసి క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో ఐసిఐసిఐ బ్యాంక్ జాబ్ సాధించింది.

అయితే ఎంత డబ్బు సంపాదించినా ఆమెకు ఎప్పుడూ ఏదో వెలితిగా ఉండేది. పాఠశాలలో చదువుకుంటున్న రోజుల్లో టీచర్లు అంతా కూడా ఆమె కు ఐఏఎస్ కావాలి అని చెప్పేవారట. ఆ విషయం గుర్తుకు తెచ్చుకున్న అనూ ఒకరోజు సివిల్ సర్వీస్ కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు తల్లిదండ్రులు పెళ్లి చేశారు. ఐతే కొన్నేళ్లపాటు తన వైవాహిక జీవితాన్ని ఎంతోసంతోషంగా గడిపింది. వియాన్ అనే ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. అయితే పెళ్లి అయ్యి బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఆమెకు సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ రాయాలని ఐఏఎస్ కావాలని ఉండేది. ఉదయాన్నే లేచి చదువుకునేది కానీ పిల్లోడిని ఆటాడించే క్రమంలో ఆమె సమయం అంతా వృధా అయ్యేది.

దీంతో తాను తన పిల్లాడిని తన తల్లి దగ్గర ఉంచి గురుగావ్ కు వెళ్ళింది. ఆ తర్వాత నిర్విరామంగా చదివి ఎగ్జామ్స్ రాసింది కానీ అర మార్కు తేడాతో ఫెయిల్ అయింది మళ్ళీ రెండవ సారి ఎగ్జామ్స్ రాసి సక్సెస్ అయింది. అయితే ఎట్టకేలకు తాను అనుకున్నది సాధించడంతో ఆమె ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. అలాగే ఆమె అందరికీ స్ఫూర్తిదాయకం గా నిలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: