గర్భధారణ సమయంలో మహిళలు చాల జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే గర్భధారణ సయమంలో గ్రహణం వచ్చినప్పుడు ఎలా ఉండాలి. ఏం తినాలి, ఎలాంటి పనులు చేయాలో ఎవరికీ తెలీదు. ఈ సమయంలోనే గ్రహణం వస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. ఇక గర్భంతో ఉన్నప్పుడు ఇలాంటి నియమాలు పాటించకపోతే కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పెద్దలు చెప్తారు.

గ్రహణ సమయంలో గర్భిణీలు కదలకుండా పడుకోవాలి అని పెద్దలు చెబుతారు. దీని వల్ల గర్భంలోని పిండంపై ప్రభావం పడి పిల్లలకు గ్రహణ మొర్రి, ఇతర లోపాలతో పుడతారని చెబుతారు. దీనికి శాస్త్రీయపరంగా రుజువులు లేవని కొంతమంది కొట్టి పారేస్తారు.. అయితే.. ఇది మూఢనమ్మకమా, శాస్త్రీయ కోణమా అనేది పక్కనబెడితే గర్బిణిలు కొన్ని సూచనలు పాటించాలి. గ్రహణం పట్టడానికి మూడు గంటల ముందే భోజనం ముగించాలని చెబుతారు.

అంతేకాదు సూర్య గ్రహణం రావడానికి ముందే భోజనం తీసుకోవడం కంటే ఆ సమయానికి తీసుకున్న భోజనం అరిగేలా తీసుకోవాలని చెబుతున్నారు. అంటే గ్రహణానికి ఓ మూడు గంటల ముందే భోజనం చేసుకోవాలి. గర్భంలోని పిండంపై త్వరగా ప్రభావం చూపుతుందని.. తద్వారా పుట్టబోయే సంతానం ఏదైనా లోపాలతో పుడతారని నమ్ముతారు. నీరు కూడా తీసుకోవద్దని సూచిస్తున్నారు. మిగతావారు ఆ సమయంలో ఆహారం, నీరు తీసుకున్నా పెద్దగా ప్రమాదం ఉండదు.

ఆయితే గ్రహణ సమయంలో గర్భిణీలు కచ్చితంగా ఎలాంటి పనులు చేయకుండా విశ్రాంతి తీసుకోవాలి. ఇక గ్రహణ సమయంలో సూర్యుడిని నేరుగా చూడడం వల్ల అందులో నుంచి కాస్మిక్ కిరణాలు హాని కలిగిస్తాయి. ఇవి పరిశోధనాత్మకంగా కూడా నిరూపణ జరిగింది. ఈ కిరణాలు.. గర్భిణీలపై ప్రభావంతో చూపుతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. సాంకేతికంగా, శాస్త్రీయపరంగా కూడా గర్భిణీలు కచ్చితంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి ఒక్కరూ నమ్ముతారు. కాబట్టి ప్రెగ్నెంట్స్ ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు, పెద్దలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: