అయితే సాధారణంగా గర్భం దాల్చిన తర్వాత వజైనల్ డిశ్చార్జ్ సాధారణంగానే కనిపిస్తుంది. కానీ నీళ్లు నీళ్లుగా ఎక్కువగా కనిపిస్తుంటే ఉమ్మ నీరు బయటకు వెళ్లిపోతోందేమో అని పరీక్షించాల్సి వస్తుంది. ఈ ఉమ్మనీరు మీ బిడ్డ చుట్టూ రక్షణ కవచంలా ఉండి బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది. మీ డెలివరీ డేట్ కి ముందుగా ఇలా జరిగితే అది బిడ్డకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. అందుకే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి చికిత్స తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
గర్భం దాల్చిన తర్వాత ఆఖరి త్రైమాసికంలో కడుపులో బిడ్డ పెరుగుదల వల్ల కాళ్లకు రక్త ప్రసరణ సరిగ్గా జరగక చాలామందికి అరికాళ్లు కొద్దిగా వాపు వస్తుంటాయి. కొందరికి చేతులు, ముఖం కూడా వాస్తుంటాయి. కొద్దిగా వాపు రావడం సాధారణమే అయినా.. ఈ వాపు తో పాటు ఎరుపుదనం, ర్యాషెస్ కనిపించినా.. వాపు చాలా ఎక్కువగా ఉన్నా డాక్టర్‌ని సంప్రదించాలి. రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టడం దీనికి కారణం కావొచ్చన్నారు
అయితే సాధారణంగా చాలామంది మహిళలకు ప్రెగ్నెన్సీ మొదటి నెలల్లో కాస్త రక్తస్రావం జరుగుతుంది. అయితే ఇది మరీ ఎక్కువగా కాకుండా చాలా కొద్దిగా ఉంటుంది. కానీ ఒకవేళ మీరు గర్భం ధరించిన తర్వాత మీకు రక్తస్రావం అవుతూ ప్యాడ్ వాడాల్సిన పరిస్థితి ఎదురైతే మాత్రం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే అని చెబుతున్నారు.
అయితే సాధారణంగా ఆడవారికి పిరియడ్స్ సమయంలో పొత్తి కడుపులో నొప్పి రావడం సహజమే. గర్భాశయం సంకోచ వ్యాకోచాలు చెందడం వల్ల ఇలా జరుగుతుంది. ఇలా మామూలుగా అయితే సహజమే. కానీ గర్భం ధరించిన తర్వాత కాస్త ఎక్కువగా పొత్తి కడుపులో నొప్పి వస్తోందంటే అది ప్రమాద సంకేతంగా గుర్తించాలి. మీరు మూడో త్రైమాసికంలో ఉంటే అవి కాన్పు నొప్పులు కూడా కావొచ్చు. అందుకే గర్భం ధరించిన తర్వాత ఎప్పుడు పొత్తి కడుపులో కాస్త ఎక్కువగా నొప్పి వచ్చినా డాక్టర్ ని సంప్రదించడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.