భార‌త‌దేశంలో సామాజికంగా, ఆర్థికంగా నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారాలు క‌నుక్కోవ‌డానికి చేయ‌ని ప్ర‌య‌త్న‌మంటూ ఉండ‌దు. చిన్న చిన్న స‌మ‌స్య‌లు కూడా ఏళ్ల త‌ర‌బడి పేరుకుపోయి ప‌రిష్కారానికి వీలుకాని స‌మ‌స్య‌ల్లా మారిపోతున్నాయి. ఈ కోవ‌లోకే వ‌చ్చేది ఆస్తి స‌మ‌స్య‌. దీనిపై దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సంచ‌ల‌న తీర్పును వెలువ‌రించింది. దేశంలోని ప్రతి మహిళ తన తండ్రి నుంచి వచ్చిన వారిని ఆమె ఆస్తికి వారసులుగా తీసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తన పుట్టింటి వారిని కుటుంబ సభ్యులుగా అంగీకరించవచ్చని.. వారిని బయటి వ్యక్తులుగా తీసుకోలేమని స్పష్టం చేసింది.

1956లో హిందూ వారసత్వ చట్టం సెక్షన్ ప్రకారం ప్రతి మహిళ తండ్రి కుటుంబ సభ్యులు వారసుల పరిధిలోకి వస్తారని కోర్టు తీర్పు వెల్లడించింది. తండ్రి వారసులను తన ఆస్తి వారసులుగా తీసుకోవచ్చని.. వారు ఆస్తిని పొందేందుకు వీలుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జగ్నో అనే మహిళ తన భర్త ఆస్తిని పొందడంపై న‌మోదైన కేసుకు సంబంధించి ఈ తీర్పు వ‌చ్చింది. జ‌గ్నో భర్త 1953లో మరణించాడు. వారికి సంతానం లేకపోవడంతో ఆమెకు వ్యవసాయ ఆస్తిలో సగం వాటా వచ్చింది. ఆమె ఆస్తికి వారసురాలైంది.

తర్వాత జ‌గ్నో తన సోదరి కొడుకులకు ఈ ఆస్తిని ఇచ్చింది. దీంతో ఆమె భర్త సోదరుడి కొడుకులు ఆస్తి తమకు చెల్లుతుందని.. వారి ఆస్తి వారికి ఇవ్వాలని కోర్టులో దావా వేశారు. తన భర్త ఆస్తిని సోదరులకు ఇచ్చేందుకు ఆమోదించాలని జగ్నో కూడా హైకోర్టును ఆశ్రయించారు.  దీనిపై విచారించిన హైకోర్టు ఆమె భర్త ఆస్తిని ఆమె సోదరుడి కొడుకుల పేరు మీద చేయలేమని,  ఆస్తిలో హక్కు ఉన్నవారితోమాత్రమే చేయాలని తీర్పునిచ్చింది. దీనిపై జ‌గ్నో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 15.1డి ప్రకారం హిందూ మహిళ తండ్రి బంధువులు, కుటుంబ సభ్యులు తనకు బయటివారు కాదని.. ఆమె కుటుంబంలోని సభ్యులేనని.. వారికి ఆస్తి ఇవ్వొచ్చని సంచలన తీర్పును వెలువ‌రించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: