అయితే ఈ మధ్య ప్రసవానంతరం కలిగే ఒత్తిడికి సిరోటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్లతో చికిత్స చేస్తున్నారు. దీన్నే ఎస్ఎస్ఆర్ఐలు అని కూడా పిలుస్తారు. ఇది ఒక యాంటిడిప్రెసెంట్ ఔషధాల కలయిక. అయినప్పటికీ దీన్ని తీసుకోవడం ముందు ముందు చాలా దుష్ప్రభావాలకు దారితీస్తుంది. కాబట్టి ప్రసవానంతర ఒత్తిడికి SSRIలు ఆరోగ్యకరమైన ఔషధాలు కావు. మరి దీనికి ప్రత్యమ్నాయం ఏంటి అని మీరు అలోచించి ఉంటే.. మీకున్న సహజ ప్రత్యామ్నాయం కుంకుమపువ్వును మీ ఆహారంలో చేర్చడం.
అంతేకాదు కుంకుమపువ్వు కొత్త తల్లులను ఒత్తిడి, చిరాకు, ఆందోళన లాంటి చాలా రకాల సమస్యల నుంచి కాపాడుతుంది. ఈ విషయం మేం కాదు.. కొందరు అధ్యయనకారులు చెబుతున్నారు. దీని కోసం వారు తేలికపాటి ప్రసవానంతర మాంద్యంతో బాధపడుతున్న మహిళలను రెండు సమూహాలుగా విభజించారు. ఒక గ్రూపు వారికి ఎస్‌ఎస్‌ఆర్‌ఐల నియమావళి ప్రకారం ఇచ్చారు. మరో బృందానికి ఆరు వారాలపాటు రోజుకు రెండుసార్లు 15 మి.గ్రా కుంకుమ పువ్వు ఇచ్చారు.
అయితే మూడు వారాల తర్వాత ఫలితాలు చూస్తే.. SSRIలు తీసుకున్న వారిలో ఒత్తిడి నుంచి 21.9% ఉపశమనం కలిగిస్తే.., కుంకుమ పువ్వు తీసుకున్న వారిలో 18.8% ఉపశమనం కనిపించినట్టు తేలింది. అలాగే ఎస్‌ఎస్‌ఆర్‌ఐ వారిలో పొడి నోరు, తలనొప్పి, పగటి మగత, చెమట, మలబద్ధకం వంటి దుష్ప్రభావాలను కనిపించగా.. కుంకుమపువ్వు తీసుకున్న వారిలో ఎలాంటివి కనిపించలేదట. కాబట్టి కుంకుమ పువ్వు నిజంగా ప్రసవానంతర మాంద్యాన్ని ఎదుర్కోవడంలో సహాయపడతుందని అధ్యయనం తేల్చి చెప్పింది. అలాగే ఇది మీ ఆహారానికి గొప్ప రుచిని అందిస్తుంది.