గర్భధారణ సమయంలో మహిళలు చాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక అమ్మ  కడుపులో ఉన్న శిశువు అప్పుడప్పుడు కాళ్లతో తన్నడం,కదలడం జరుగుతుంటుంది. ఇలా జరగడం అనేది  బిడ్డ ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడన్న విషయాన్ని తెలియచేస్తుంది. అంటే మీరు సరైన ఆహారం తీసుకోవడంతో పాటుగా  సంతోషంగా ఉండాలి. అయితే కడుపులో ఉన్న శిశువు కి బయటి శబ్దాలను, మాటలను గ్రహించగలిగే శక్తి ఉంటుంది. తల్లి ఎమోషన్స్ కూడా కడుపులోని బిడ్డకు అర్ధం అవుతాయి.

అయితే మీరు సంతోషంగా, చక్కగా హాయిగా నవ్వుతూ ఉంటే బిడ్డ కూడా అలానే ఉంటాడు. మీరు ఏడుస్తూ బాధపడటం చేస్తే కడుపులోని బిడ్డ కూడా అలానే ఉంటుంది. పాపం ఏమి తెలియని బిడ్డను రకరకాల ఎమోషన్స్ గురిచేయడం ఎంతవరకు సమంజసమో మీరే ఆలోచించండి.

తాజా అధ్యయనాల ప్రకారం గర్భంతో ఉన్నప్పుడు తల్లి ఇష్టం గా తినే ఆహార పదార్థాలను పిల్లలు తినడం చేస్తుంటారు. తల్లికి ఇష్టమైన ఆటలు, గర్భం తో ఉన్నప్పుడు చేసిన ఇష్టమైన పనులు, అభిరుచులు, అలవాట్లు వారి పిల్లలకు వస్తాయని సర్వే లో బయట పడ్డ విషయం. అలాగే తల్లి ఎప్పుడు విచారం, బాధపడటం వలన పిల్లల పుట్టి పెరుగుతున్నపుడు విచారంగా ఉండటం, ఆక్టివ్ గా లేకపోవడం జరుగుతుంటుంది. అదే గర్భధారణ సమయం లో  నవ్వుతూ, సంతోషం గా ఉంటే పిల్లలు కూడాచలాకీగా, ఉత్సాహం గా ఉంటారు.

ఇక గర్భధారణ సమయంలో వికారంగా ఉండడం, వాంతులు అవడం , ఉత్సాహంగా లేకపోవడం గర్భధారణ సమయంలో సహజం గా ఉండేవే. కాబట్టి  ప్రతి చిన్న విషయానికి మదనపడకుండా ఎప్పటికప్పుడు సంతోషం గా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలాగే ప్రెగ్నెంట్  సమయంలో చేయాల్సిన వ్యాయామాలు, ధ్యానం చేయడం చాలా అవసరం.

అయితే ఇంకో ముఖ్యమయిన  విషయం ఏమిటంటే  పోషక ఆహారం ఏ మాత్రం తక్కువ కాకుండా చూసుకుని తింటుండాలి. వైద్యులు తెలిపిన దాని  ప్రకారం తల్లి గర్భం తో ఉన్నప్పుడుఎలాంటి పరిస్థితులలో  ఉంటుందో కడుపులో ఉన్న బిడ్డ బయటకు వచ్చాక చాలా వరకు అలానే ఉంటారని ,అందుకే ఎప్పుడు నవ్వుతూ, సంతోషంగా ఉండేందుకు శ్రద్ధ చూపించాలని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: