అయితే ప్రెగ్నెసీ సమయంలో యోగా అనేది పుట్టబోయే బిడ్డకు ఇబ్బందులు లేకుండా, ఆరోగ్య సమస్యలు లేకుండా ఈలోకంలోకి తీసుకురావడానికి సహాయపడుతుంది. గర్భం దాల్చిన మూడు త్రైమాసికాల్లో సాధన చేసే పోజిషన్స్, వ్యాయామాలు ప్రతి దశలో భిన్నంగా ఉంటాయి. గర్భం దాల్చక ముందు, ఆ తర్వాత చేసే యోగా సెషన్‌లు ముఖ్యంగా ప్రసవ సమయంలో కంఫర్ట్‌గా ఉండేందుకు సహాయపడుతున్నాయి. అలాగే ప్రసవ సమయంలో నొప్పిని తట్టుకునేలా శిక్షణ ఇవ్వబడుతుంది. ప్రెగెన్సీ సమయంలో బద్ధకం, హై బీపీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే రోజుకు రెండు సార్లు 30 నిమిషాల చొప్పున వాకింగ్ చేస్తే ఈ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. నెమ్మదిగా నడవండి.. కానీ రోజు నడవండి" అని కేదార్ నాథ్ చెప్పారు.
మొదటి త్రైమాసికంలో నిలబడి చేసే యోగాసానాలు చేయడం మంచింది. ఇలా చేయడం ద్వారా కాళ్లలో బలం పెరగడం, ప్రసరణ మెరుగుపరడం, శక్తిని ఉత్పత్తి చేయడానికి, కాళ్ల తిమ్మిరిన తగ్గించడం వీలవుతుంది.ఇక, రెండో, మూడో త్రైమాసికాల్లో శ్వాస(బ్రీతింగ్), ధ్యానంపై దృష్టిపెట్టాలి. అలసట, అధిక పని నుంచి రిలీఫ్ పొందేందుకు ఆసనాలు చాలా వరకు తోడ్పడతాయి. గర్భధారణ సమయంలో పదోవారం నుంచి 14వ వారం వరకు చాలా కీలకమైన సమయం. అందుకే అప్పుడు యోగా చేయమని ఎవరు సలహా ఇవ్వరు. ఆ సమయంలో పొత్తి కడుపును ఎక్కవగా విస్తరించకూడదు. యోగా ఆసనాలతో పాటుగా ఫిట్‌గా ఉండేందుకు వాకింగ్ కూడా చేయాలి.