1. బాలీవుడ్ స్టార్ మిథున్ చక్రవర్తి ఒక పసిపిల్లను దత్తత తీసుకున్న విషయం ఎంతమందికి తెలుసు. దీని గురించే ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. తన పిల్లలతోనే సరిసమానంగా ఆ అమ్మాయిని ప్రేమగా చూసుకుంటున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో చూద్దాం.

అమ్మాయి పేరు దిశాని. ప్రస్తుతం ఆమె నటనలో శిక్షణని తీసుకుంటుంది. తొందరలో హీరోయిన్ గా బాలీవుడ్ లోకి కూడా అడుగు పెట్టబోతోంది. అయితే దిశాని ఇంతగా యాక్టింగ్ లో శిక్షణ తీసుకోవడం వెనుక ప్రముఖ బాలీవుడ్ స్టార్ మిథున్ దంపతులు ప్రధానంగా ఉన్నారు. ఒకవేళ మిథున్ చక్రవర్తి ఆ రోజు ఈమెను దత్తత తీసుకోని ఉండకపోయి ఉంటె ఇప్పుడు దిశాని అనే పిలువబడే ఈ అమ్మాయి ఎక్కడ ఉండేదో మనకి తెలియదు. ఒక రోజు మిథున్ చక్రవర్తి పేపర్ లో ఒక ప్రకటన చూసారు. దాని సారాంశం ఏంటంటే 'రోడ్డు పక్కన చెత్త బుట్టలో ఒక పసిపిల్ల వారికీ కనిపించింది. ఆ పసిపిల్ల చాలా దారుణమైన స్థితిలో పడివేసి ఉంది.' ఈ వార్తను చుసిన మిథున్ చక్రవర్తి ఆ పాపను దత్తత తీసుకోవాలనే ఆలోచన కలిగింది. వెంటనే ఆ అధికారులను సంప్రదించి వారికీ ఆ విషయాన్నీ చెప్పారు.

మిథున్ ఆవార్త ని తన భార్య యోగితకి చెపుతూ తన ఆలోచనని కూడా చెప్పాడు. వెంటనే యోగిత కూడా ఆ పాపను  దత్తత తీసుకోడానికి మొగ్గుచూపడంతో సదరు అధికారుల సమక్షం లో మిథున్ దంపతులు ఆ పాపను దత్తత తీసుకున్నారు. మిథున్ దంపతులకు అప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నారు. పాపను దత్తత తీసుకున్న వాళ్ళు 'దిశాని' అనే పేరు పెట్టారు. ఈమెను తన ముగ్గురు పిల్లలతో సమానంగా చూసుకుంటూ పెంచి పెద్ద చేసారు. దిశానికి నటన అంటే ఆసక్తి ఉండడంతో ఇప్పుడు  హీరోయిన్ అవడం కోసం రెడీ అవుతుంది.ఆమెకు అల్ ది బెస్ట్ చెబుదాం.

మరింత సమాచారం తెలుసుకోండి: