ఇలాంటి సమస్యే ప్రపంచానికి ఐటీ పాఠాలు చెప్పే.. ప్రముఖ టెకీగా గుర్తింపు పొందిన కోటిరెడ్డి సరిపల్లి కుటుంబంలో చోటు చేసుకుంది. కోటిరెడ్డి, శ్రీజారెడ్డి దంపతుల ఏకైక కుమారుడికి వినికిడి లోపం వచ్చింది. ఈ దంపతుల పెద్ద కుమారుడు సంహిత్ వినికిడి లోపంతో పుట్టడంతో వీరు ఎంతో మనోవేదనకు గురయ్యారు. నిజానికి చేతి నిండా డబ్బులున్నాయి. ఐశ్వర్యానికి లోటు లేదు. అనుభవించే అవకాశమూ ఉంది. అయితే తమ పెద్దకుమారుడు మందులకు లొంగని వినికిడి లోపంతో ఇబ్బంది పడుతున్నారు. అంతే! ఆ తల్లిదండ్రుల ఆవేదన కట్టలు తెగింది. ఏం చేయాలి ?
తమ కుమారుడిని ఎలా నయం చేసుకోవాలి ? ఇదే ఆ తల్లిదండ్రులకు ప్రధాన సమస్యగా మారింది. ఈ క్రమంలో తండ్రి కన్నా తల్లి శ్రీజారెడ్డి పడిన ఆవేదన అంతా ఇంతా కాదు. ఒక్కగానొక్క కుమారుడు వినికిడి సమస్యతో ఇబ్బంది పడుతుంటే.. ఆమె చూడలేక పోయారు. ఎలాగైనా తమ కుమారుడిని నయం చేసుకోవాలని భావించారు. ఈ క్రమంలోనే ఆమె అనేక మంది వైద్యులను కలిశారు. అయితే, ఎవరిని కలిసినా.. నయం కాని వ్యాధిగానే తేల్చి చెప్పారు. అయినా పట్టు వీడని ప్రయత్నం తన కుమారుడిని నయం చేసుకోవాలనే గట్టి సంకల్పం ఆమెను ముందుకు నడిపించాయ. ఫలితంగా ఏర్పడిందే పినాకిల్ బూమ్స్ సంస్థ. ఒక్క తన కుమారుడినే కాదు.. ఆటిజంతో ఇబ్బంది పడుతున్న ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పిల్లలకు ఆసరా నిలిచారు. స్వయంగా ఒక సంస్థను స్థాపించి ఎందరో వేల మంది పిల్లలకు అండగా నిలిచి..ఈ సమాజ అభివృద్ధికి పాటు పడుతున్నారు..శ్రీజా రెడ్డి గారి సేవా గుణానికి హ్యాట్సాఫ్ చెప్తూ.. వీరి లాంటి వారిని ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది మహిళలు మరెన్నో సేవా కార్యక్రమాలను చేయాలని కోరుకుందాం..!!