
ఆ తర్వాత ఆమె బయట అమ్మడం ఆపేసి భక్తి ఛాయ్ అనే పేరుతో ఒక షాప్ ని పెట్టింది. ఆలా ఆమె షాప్ కూడా విజయవంతం అయ్యింది. ఆ అల్లం టీ ద్వారా ఆమె అక్షరాల 220 కోట్లకు పైగా సంపాదించింది. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. ఇండియా లో రుచి చుసిన అల్లం టీ అమెరికా లో బిజినెస్ పెట్టి ఆమ్మడం మూలంగా ఆమెకు అంత ఆదాయం వచ్చిందంటే నిజంగా అది ఇండియా గొప్పదనము అవుతుంది. అయితే ఆ మహిళా తన బిజినెస్ ఇంత పాపులర్ అవడానికి గల కారకులైన ఇండియాని మాత్రం ఆమె మర్చిపోలేదు. బ్రుక్ ఎడ్డీ సామజిక సేవకురాలు కావడం వల్ల వచ్చిన ఆదాయం లో కొంత భాగాన్ని ఇండియాలోని పేదల కోసం ఖర్చు పెట్టడం విశేషం. ఈ విధంగా ఇండియా పై ఆమె కృతజ్ఞత భావాన్ని చూపింది. ఆలా ఇండియా లో అల్లం ఆంటీ ని చేయడం నేర్చుకొని అమెరికా లో బిజినెస్ గా ప్రారంభించి విజయవంతమైన బ్రుక్ ఎడ్డీ అనే మహిళా కథ ఇది.